లారీ క్యాబిన్ నుంచి ఎగసి పడుతున్న మంటలను ఆర్పివేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
పెద్దాపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనా లు బలంగా ఢీ కొట్టిన ఘటనలో డ్రైవర్‌కు స్పల్ప గాయాలు కాగా పెను ప్రమాదం త్రుటిలో తప్పిన ఘ టన ఆదివారం అర్ధరాత్రి పెద్దాపురం ఏడీబీ రోడ్డులో చోటు చేసుకుంది. పెద్దాపురం పోలీసుల కథనం ప్రకారం మహారాఫ్ట్ర నుంచి కాకినాడకు వెళుతున్న ట్యాంకర్‌ను స్థానిక పాండవుల మెట్ట వద్ద జంక్షన్‌లో పెద్దాపురం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతు న్న టిప్పర్ బలంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయి ల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించాయి. రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో ఎదురుగా ఉన్న ట్యాంకర్ డ్రైవర్‌కు స్పల్ప గాయాలు కాగా ఘటన జరిగిన ట్యాంకర్‌లో 30 వేల లీటర్ల ఇథనాల్ ఉంది. ట్యాంకర్‌కు నిప్పంటుకోకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమా దం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దాపురం ఏడీబీ రోడ్డులో
ఎదురెదురుగా ఢీకొన్న ట్యాంకర్, టిప్పర్
డ్రైవర్‌కు స్పల్ప గాయాలు
Comments
Please login to add a commentAdd a comment