కురీ్చ కోసం ఖరీ్చఫ్‌లు | - | Sakshi
Sakshi News home page

కురీ్చ కోసం ఖరీ్చఫ్‌లు

Published Sat, Jan 18 2025 2:52 AM | Last Updated on Sat, Jan 18 2025 2:52 AM

కురీ్

కురీ్చ కోసం ఖరీ్చఫ్‌లు

సెర్చ్‌ కమిటీలతో కాలయాపన

పూర్తి స్థాయి వీసీలు నియామకంలో జరుగుతోన్న జాప్యం రెండు వర్సిటీల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తోందంటున్నారు. ఇదే విషయమై పదేపదే విద్యార్థులు మొత్తుకుంటున్నా సెర్చ్‌ కమిటీ అంటూ సర్కార్‌ కాలయాపన చేస్తోందనే విమర్శలున్నాయి. వీసీ పీఠం కోసం ఖర్చుకు వెనుకాడకుండా పై స్థాయిలో కొందరు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. జేఎన్‌టీయూ కాకినాడ కుర్చీ కోసం రూ. రెండు, మూడు కోట్లకు వెనుకాడటం లేదని వర్సిటీలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సెర్చ్‌ కమిటీకి 30 మంది వరకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వర్సిటీ ప్రొఫెసర్‌ ఈ పోస్టు కోసం మాట్లాడుకున్నారని వినిపిస్తోంది. ఇందుకు పొరుగు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో చినబాబుతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. ఆదికవి నన్నయ్య వీసీ కుర్చీ కోసం కృష్ణా, గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక మహిళా ప్రొఫెసర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని తెలియవచ్చింది. కూటమి సర్కార్‌లో కొందరు పెద్దలతో ఉన్న పరిచయాలతో ఆమె ఈ పోస్టు కోసం ఉన్నత స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నారంటున్నారు. వర్సిటీ వర్గాల్లో జరుగుతోన్న చర్చను బట్టి సెర్చ్‌ కమిటీలు వీసీల నియామకానికి ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికే పరిమితమయ్యాయి.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: విశ్వవిద్యాలయాలు రాజకీయ చక్రబంధంలో అల్లాడి పోతున్నాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేసే విశ్వవిద్యాలయాలకు వైస్‌ చాన్సలర్‌ల నియామకానికి సంబంధించిన పీటముడి వీడటం లేదు. పనితీరు, నైపుణ్యంతో ప్రమేయం లేకుండా రాజకీయ పలుకుబడి, ధనబలం ఉన్న వారికే ఈ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నాలు ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు కావస్తున్నా జేఎన్‌టీయూ కాకినాడ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాలకు ఉప కులపతి నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దూరదృష్టితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జేఎన్‌టీయూ, రాజానగరంలో ఆదికవి నన్నయ వర్సిటీలను స్థాపించారు. ఈ రెండు ప్రాంతాల్లో రెండు వర్సిటీలకు అంకురార్పణ చేసి ఉన్నత విద్యాభివృద్ధికి బాటలు వేశారు.

రాజకీయాలు చొప్పించిన కూటమి సర్కారు

ప్రారంభంలో ఎనిమిది జిల్లాల పరిధిలో కాకినాడ వర్సిటీ ఏర్పాటైంది. 160 ఇంజినీరింగ్‌ కాలేజీల ద్వారా ఏటా సుమారు 45వేల మంది విద్యార్థుల భవిష్యత్యుకు మార్గం చూపించింది జేఎన్‌టీయూ కాకినాడ. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ వర్సిటీకి వీసీ నియామకాన్ని త్వరతిగతిన చేపట్టాలని మేధావి వర్గం సూచిస్తోంది. ఈ రెండు వర్సిటీల వీసీలను కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన రోజుల వ్యవధిలోనే అర్ధంతరంగా ఇంటికి పంపించేసింది. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చొప్పించడం సహేతుకం కాదనే మేధావి వర్గం అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా కేవలం గత ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారనే ఏకై క కారణంతో ఇద్దరు వీసీలను తప్పించింది. వాస్తవానికి జేఎన్‌టీయూ కాకినాడ వర్సిటీ వీసీ పదవీ కాలం ఆరు నెలలు, నన్నయ్య వర్సిటీ వీసీ పదవీకాలం రెండేళ్లు మిగిలి ఉండగానే కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా రాజీనామా చేయించింది. అలాగని ఎక్కడా అధికారిక ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాలతోనే ఈ రాజీనామాలు చేయించింది. ఇదంతా ప్రభుత్వం గద్దె నెక్కి పట్టుమని 10 రోజులు కూడా గడవకుండానే జరిపించేసి తమ భవిష్యత్‌ను దెబ్బతీసిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వీసీలు రాజీనామా చేసి ఇంచుమించు ఏడు నెలలు కావస్తున్నా రెండు వర్సిటీలు ఇన్‌చార్జ్‌ వీసీలతోనే కాలక్షేపం చేస్తున్నాయి.

నియామకం ఇలా..

గత డిసెంబర్‌లో రెండు వర్సిటీల పాలకమండళ్ల అత్యవసర భేటీలో వీసీల నియామకాల కోసం చర్చించారు. సెర్చ్‌ కమిటీలో ఉండే ముగ్గురు విద్యావేత్తలలో విశ్వవిద్యాలయాల పాలకమండలి ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. యూజీసీ ఒక విద్యావేత్తను, ప్రభుత్వం మరో అభ్యర్థిని నియమిస్తుంది. సెర్చ్‌ కమిటీలు దర ఖాస్తులు పరిశీలన చేసి మూడు పేర్లతో జాబితా రూ పొందిస్తే ఒకరి పేరును వీసీగా గవర్నర్‌ ఖరారు చేస్తారు.

ఎవరి ప్రయత్నాలు వారివే...

ప్రస్తుత ఇన్‌చార్జిలుగా చేస్తున్న వారితో పాటు గతంలో రిజిస్ట్రార్‌లు, డైరెక్టర్‌లుగా పనిచేసిన వారితో పాటు ప్రస్తుత డైరెక్టర్లు కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. వీసీల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు సామాజిక, ఆర్థిక అంశాల ప్రాతిపదికన జరుగుతోన్న ప్రయత్నాలు అటు జేఎన్‌టీయుకే, ఇటు ఆదికవినన్నయ్య వర్సిటీలో హాట్‌టాపిక్‌గా మారాయి. జేఎన్‌టీయూకే ప్రొఫెసర్‌ మురళీకృష్ణ, ఆదికవి నన్నయ్య వర్సిటీకి జియాలజీ ప్రొఫెసర్‌ వై.శ్రీనివాసరావు ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీలుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు పలువురు వీసీ పోస్టు ఆశిస్తూ ఆ మేరకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుందంటున్నారు.

వీసీ పోస్టులకు రూ.కోట్లు ఖర్చు

చేస్తున్న ఆశావహులు

రాజకీయ చక్రబంధంలో వర్సిటీలు

జేఎన్‌టీయూకే కోసం

తెలంగాణ ప్రొఫెసర్‌ యత్నాలు

నన్నయ పీఠానికి మహిళా ప్రొఫెసర్‌ పోటీ

వీసీలను త్వరగా

నియమించాలి

గత వీసీలకు ఇంకా సమయం ఉన్నా అర్ధంతరంగా తొలగించి ఇన్‌చార్జి వీసీలను నియమించారు. విశ్వవిద్యాలయాలను ఆరు నెలలుగా ఇన్‌చార్జ్‌ వీసీల పాలనలోనే నడుపుతున్నారు. వైస్‌ చాన్సలర్‌లను త్వరగా నియమిచాలి. ఇన్‌చార్జ్‌లు ఉండడంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ కారణంగా విద్యావ్యస్థకు నష్టం జరిగే పరిస్థితి ఉంది.

– ఎం.గంగా సూరిబాబు,

ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా కార్యదర్శి, కాకినాడ

ఇన్‌చార్జిలు చురుకుగా

నిర్ణయాలు తీసుకోలేరు

యూనివర్సిటీల నిర్వహణలో ఫుల్‌చార్జి వైస్‌ చాన్సలర్లను నియమించాల్సిన ప్రభుత్వం ఇన్‌చార్జిలతో కాలం గడపడం సహేతుకం కాదు. ఇన్‌చార్జిలు ఎవరైనా సరే ఆయా యూనివర్సిటీలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చురుకై న పాత్ర నిర్వర్తించలేరు. అదే ఫుల్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌ ఉంటే అవసరం అనుకుంటే గవర్నర్‌ వద్దకు నేరుగా వెళ్లి యూనివర్సిటీ కోసం మాట్లాడే అవకాశం ఉంటుంది. వెంటనే ఫుల్‌చార్జ్‌ వీసీలను నియమించాలి.

– అశోక్‌కుమార్‌, డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, తూర్పుగోదావరిజిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
కురీ్చ కోసం ఖరీ్చఫ్‌లు1
1/2

కురీ్చ కోసం ఖరీ్చఫ్‌లు

కురీ్చ కోసం ఖరీ్చఫ్‌లు2
2/2

కురీ్చ కోసం ఖరీ్చఫ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement