● అయినవిల్లి.. భక్తులతో శోభిల్లి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయం భక్తులతో శోభిల్లింది.. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రద్దీ నెలకొంది. శుక్రవారం ఒక్కరోజే ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, ప్రసాదాలు, అన్నదాన విరాళాలుగా రూ.5,02,435 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. తొలుత ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పంచామృత అభిషేకాల్లో ఇద్దరు, లఘున్యాస అభిషేకాల్లో 121 మంది, స్వామి పరోక్ష అభిషేకాల్లో ముగ్గురు, గరిక పూజలో ఒకరు, ఉండ్రాళ్ల పూజలో ఐదుగురు, స్వామివారి శ్రీలకీ్‌ష్మ్ గణపతి హోమంలో 71 మంది దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఇద్దరు చిన్నారులకు అన్నప్రాసన, ఏడుగురు చిన్నారులకు తులాభారం నిర్వహించారు. 24 మంది నూతన వాహన పూజలు చేయించుకోగా 6,310 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఇదిలా ఉంటే సంకటహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లచెరువు వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోనూ పూజలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment