పకడ్బందీగా స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్
– కలెక్టర్ ప్రశాంతి సూచనలు
రాజమహేంద్రవరం రూరల్: ఈ నెల 18 నుంచి చేపట్టనున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ జరిగిన సమావేశంలో జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమం అమలుపై మునిసిపల్, పంచాయతీ అధికారులకు కలెక్టరు సూచనలు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్‌గా పాటించాలని నిర్ణయించినట్టు తెలిపారు. థీమ్‌జి జనవరి, 2025 ‘‘కొత్త సంవత్సరం–క్లీన్ స్టార్ట్’’ ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా ‘‘దైవభక్తి పక్కన పరిశుభ్రత’’ నినాదంతో ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్తవేసే అలవాటును అరికట్టడంతో పాటు సామూహిక క్లీనింగ్ డ్రైవ్‌ల ద్వారా చెత్త, చెదారం తొలగింపు, పరిసరాలను శుభ్రపరచడం శిథిలాల తొలగింపు, బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లు, మొదలైన వాటిలో మూసుకుపోయిన కాలువలను డ్రైయిన్‌లలో పూడిక తీత పనులు చేపట్టడం ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. స్వచ్చఆంధ్ర స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. గ్రామ, మండల పంచాయతీ స్థాయి అధికారులు తొలగించిన చెత్త రవాణాకు వాహనాలు, అవసరమైన యంత్రాలు దాతల సహకారంతో సమకూర్చుకునేలా కృషి చేయాలన్నారు. ఇతర గ్రామ పంచాయితీల పారిశుధ్య సిబ్బందిని చెత్త కుప్పల తొలగింపునకు వినియోగించుకోవాలన్నారు. పారిశుధ్య పని ప్రారంభించే ముందు, చెత్తను తొలగించిన అనంతరం వివిధ కోణాలలో ఫొటోలు తీసి పీపీటీ, డాక్యుమెంటరీ రూపొందించాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలలో, స్కూల్స్ ప్రాంగణాలలో నిర్వహించి పచ్చదనం పరిశుభ్రతలో అధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. ఇన్‌చార్జి జిల్లా గ్రామ పంచాయితీ అధికారి ఎం.నాగలత, ఆర్‌ంఎసీ డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, వైద్య అధికారి వి.వినూత్న, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment