పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ఒక ట్రాన్స్‌జెండర్ ప్రకటించగా.. తాజాగా ఓ చర్మకారుడు కూడా ఆయనపై పోటీకి సిద్ధమంటున్నాడు. డిగ్రీ చదువుకున్నా కానీ కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పట్టభద్రుడిని కాబట్టే చట్ట సభలకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అందుకే పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నానని అంటున్నాడు పిఠాపురానికి చెందిన చర్మకారుడు ఏడిద భాస్కరరావు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ వద్ద చెట్టు కింద 20 ఏళ్లుగా చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి సోమవారం నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినీ యాక్టర్ పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారని, ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి అందరూ పోటీ చేస్తూంటే స్థానికుడిగా బీఏ పొలిటికల్ సైన్స చదువుకున్న తానెందుకు పోటీ చేయకూడదని అనిపించిందన్నారు. అందుకే నాలుగు నెలలుగా నియోజకవర్గ సమస్యలను పత్రికల ద్వారా సేకరించానన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పరిష్కరిస్తానని చెబుతున్న పిఠాపురంలోని సమస్యలను తాను నాలుగు నెలల క్రితమే గుర్తించానన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని కాబట్టి, ప్రజల సమస్యలు తీర్చాలంటే చట్ట సభలే వేదిక అని తలచి పోటీలో ఉండాలనుకుంటున్నానని చెప్పారు. తనకు తెలిసిన వారందరి మద్దతూ కోరుతున్నానని, చాలా మంది ముందుకు వస్తున్నారని అన్నారు. ఎలాగైనా పవన్ కల్యాణ్‌పై గెలుస్తాననే నమ్మకం తనకుందన్నారు. త్వరలో తాను కూడా ఓ మేనిఫెస్టో తయారు చేసుకుని, ప్రకటిస్తానని భాస్కరరావు తెలిపారు.
పవన్ కల్యాణ్‌పై చర్మకారుడి పోటీ
Published Tue, Apr 23 2024 8:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement