రూ.3లక్షల నష్ట పరిహారం విధింపు
కాకినాడ లీగల్: చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆరునెలల జైలు, రూ.3 లక్షల పరిహారం విధిసూ్త్ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడ చెందిన జి.హేమంత్ వద్ద నుంచి కాకినాడకే చెందిన డి.వినోద్‌కుమార్ 2021లో రూ. 3 లక్షల అప్పు తీసుకున్నాడు. బాకీ తీర్చేందుకు 2022లో రూ.3 లక్షల చెక్కు ఇచ్చారు. చెక్కును హేమంత్ బ్యాంక్‌లో వేయగా బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో వినోద్‌కుమార్ పై నేరం రుజువు కావడంతో ఆరునెలల జై లు, రూ.3 లక్షల పరిహారం విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment