గంధం నారాయణరావును భారీ మెజార్టీతో గెలిపించండి
రాజమహేంద్రవరం సిటీ: వచ్చే నెల ఐదో తేదీన జరగనున్న పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి గంధం నారాయణరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు విజ్ఞప్తి చేశారు. స్థానిక దానవాయిపేటలోని కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో గంధం నారాయణరావుకు ఐక్య వేదిక నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జూనియర్ కళాశాలల లెక్చరర్ల సంఘానికి జిల్లా, రాష్ట్ర నాయకునిగా చేసిన సేవలను, కొత్త కాలేజీ ఏర్పాటుకు చేసిన కృషిని, ఉపాధ్యాయ సమస్యలపై చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని ఆయనను బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు కోలా సత్యనారాయణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డేనియల్ బాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి.రాజారావు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రామనగేష్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, వ్యాయామోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగరాజు, మున్సిపల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.కెనడీబాబు, ఎస్ఎల్టీ జిల్లా అధ్యక్షుడు స్వామినాథన్, కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ నేత నాగవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment