పింఛన్ ఉంటుందో.. ఊడుతుందో..!
ఫ తనిఖీలతో లబ్ధిదార్లలో ఆందోళన
ఫ తాడిమళ్లలో 447 మంది పింఛన్ల తనిఖీ
నిడదవోలు రూరల్: సామాజిక పింఛన్లపై కూటమి ప్రభుత్వం తనిఖీలు చేపట్టడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో రెండో రోజైన మంగళవారం కూడా పింఛన్ల తనిఖీ చేపట్టారు. డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్ మూర్తి పర్యవేక్షణలో గ్రామంలో 453 మంది లబ్ధిదారుల వివరాలపై తనిఖీ చేపట్టగా 447 మంది వివరాలను అధికారుల బృందం యాప్‌లో నమోదు చేసింది. ఆరుగురు అందుబాటులో లేరు. ఒకేసారి 13 అధికార బృందాలు వివిధ మండలాల నుంచి తనిఖీ చేయడానికి గ్రామానికి రావడంతో లబ్ధిదార్లు తమ పింఛన్ ఉంటుందో.. ఉండదోనని ఆందోళన చెందుతున్నారు. నమ్మి గెలిపిస్తే చంద్రబాబు తమ పింఛన్లకు ఎసరు పెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల తనిఖీలో కొవ్వూరు డీఎల్‌డీఓ ఎ.స్లీవారెడ్డి, ఎంపీడీఓ డి.లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి టి.గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రసాదం కూడా భక్తితోనే పెట్టాలి
రాజమహేంద్రవరం రూరల్: భక్తులకు ప్రసాదం భక్తితోనే పెట్టాలని త్రిదండి అహో బిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. విసుక్కుంటూ పెట్టడం, ఎన్నిసార్లు తింటావంటూ హేళనగా మాట్లాడటం చేయరాదన్నారు. రాజవోలు గాయత్రీ నగర్ రామాలయం వద్ద నిర్వహిస్తున్న శ్రీమద్భాగవత సప్తాహంలో భాగంగా మంగళవారం ఆయన తన ప్రవచనం కొనసాగించారు. భక్తులంటే భగవద్బంధువులన్నారు. అందుకే వారికి భక్తితో అన్నదానం చేస్తే ఎంతో మంచి ఫలితం వస్తుందని చెప్పారు. భక్తులకు ప్రసాదం, అన్నం ప్రేమతో, ఆదరణతో పెట్టడం అలవాటు చేసుకోవాలని సూచించారు. అలా చేస్తేనే భగవంతుడు ఆనందిస్తాడని, పరమాత్మ ఆనందించే పనులు మనం చేయాలని అన్నారు. తద్వారా మనకు మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు.
జీజీహెచ్ ఓఎస్‌డీగా భాస్కర్‌రెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాస్పత్రి (జీజీహెచ్) ప్రత్యేక అధికారిగా ఎస్.భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోనేరు రంగారావు కమిటీ (కేఆర్‌ఆర్‌సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న భాస్కర్‌రెడ్డిని జీజీహెచ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డీ)గా నియమించారు. ఆస్పత్రిలో ఆయన నిర్వర్తించాల్సిన విధులపై స్పష్టత ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీజీహెచ్ ఓఎస్‌డీ హోదాలో ఆసుపత్రిని వారంలో కనీసం రెండుసార్లు ఆయన సందర్శించాలి. రోగులు, వారి సహాయకుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, ఆసుపత్రి సిబ్బంది సహకారంతో సమస్యలను పరిష్కరించాలి. ఆసుపత్రిలో వసతుల కల్పనను పర్యవేక్షించడంతో పాటు, వైద్య సదుపాయాలు రోగులకు అందుతున్న తీరుపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదించాలి. ఇన్ పేషంట్లకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను పర్యవేక్షించాలి.
మైనార్టీ సంక్షేమ అధికారిగా సరోజిని
జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా పి.సరోజిని నియమితులయ్యారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న ఆమె పోస్టింగ్ కోసం వేచి చూస్తున్నారు. ఆమెను జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సౌదీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, ఓమ్ క్యాప్, ఆల్ యూసుఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యాన బీఎస్సీ నర్సింగ్ చదివిన వారి కి సౌదీ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సౌదీ అరేబియా రీహేబిలిటేషన్ సెంటర్‌లో పని చేయడానికి ఆసక్తి ఉన్న, 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఏదైనా ఆసుపత్రిలో ఏడాదిన్నర పాటు పని చేసిన అనుభవం ఉండాలని తెలిపా రు. వీసా, విమాన టికెట్లతో కలిపి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.37,500 చెల్లించాలన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.78 వేల నుంచి రూ.89 వేల వరకూ జీతం వస్తుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15లోగా 99888 53335 లేదా 8790 11 8349 మొబైల్ నంబర్లలో సంప్రదింవచ్చన్నారు.
10ఎన్‌డీడీ52:
తాడిమళ్లలో పింఛన్ల తనిఖీని పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ మూర్తి
Comments
Please login to add a commentAdd a comment