క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా | - | Sakshi
Sakshi News home page

క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా

Published Thu, Dec 12 2024 9:41 AM | Last Updated on Thu, Dec 12 2024 9:41 AM

క్లాట

క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రముఖ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్‌(కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌)లో డ్యాఫ్నీ సివిల్స్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. శ్రీషిర్డీసాయి విద్యాసంస్థల డైరెక్టర్‌ టి.శ్రీవిద్య ఈ వివరాలను వెల్లడించారు. ఈ విద్యాసంస్థల ఆధ్వర్యంలోని అకాడమీలో శిక్షణ పొందిన ఎస్‌.స్నేహితశ్రీ జాతీయ స్ధాయి 15వ ర్యాంకు సాధించగా, జి.రోహిణీకాంత్‌ గాంధీ 52, డి.వివేక్‌ 97, జి.గణేష్‌ 104 ర్యాంకులు కై వసం చేసుకున్నారన్నారు. వెయ్యిలోపు మొత్తం 20 మంది ర్యాంకులను సాధించినట్టు వివరించారు. హాజరైన 77 మందిలో 30 మందికి పైగా వివిధ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు సీట్లు సాధించగలరన్నారు. ఏటా తమ విద్యార్థులు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలకు ఎంపిక కావడంపై విద్యాసంస్థల చైర్మన్‌ తంబాబత్తుల శ్రీధర్‌ హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకులు పొందిన విద్యార్థులు, అధ్యాపక బృందాన్ని చైర్మన్‌ శ్రీధర్‌, డైరెక్టర్లు టి.శ్రీవిద్య, శ్రీలేఖ అభినందించారు.

దగ్ధమైన బ్యాటరీ బైక్‌

రాజానగరం: బ్యాటరీ బైక్‌ అయితే పెట్రోలు, డీజిల్‌ బాధలు ఉండవని అంతా భావిస్తుంటారు. బ్యాటరీ పేలితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. మండలంలోని చక్రద్వారబంధంలో బుధవారం అదే జరిగింది. బైక్‌ యాజమాని అపాయాన్ని ముందుగానే పసిగట్టడంతో ప్రాణాలతో బయటపడ్డారు. బైకు మాత్రం మంటలకు ఆహుతైంది. వివరాలిలా ఉన్నాయి. చక్రద్వారబంధానికి చెందిన చిక్కాల రాఘవ ఏడాది క్రితం రాజమహేంద్రవరంలోని ఓ షోరూమ్‌లో బ్యాటరీ బైకును కొనుగోలు చేశారు. బుధవారం కూడా పొలానికి వెళ్లి, సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా, సీటు దిగువ ఉన్న బ్యాటరీ నుంచి చిటపట మంటూ శబ్దం రావడాన్ని గమనించారు. బైకును ఆపి, చూస్తే ఆ బ్యాటరీ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి, బైకు అంతటా వ్యాపించి, కాలి బూడిదైపోయింది. బైకును కొనుగోలు చేసిన షోరూమ్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేయగా, గ్యారంటీ పీరియడ్‌ ఏడాదేనని, తాము చేసేమీలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

లారీ ఢీకొని టీచర్‌ మృతి

కొవ్వూరు: ఐ.పంగిడి గ్రామ శివారున పెట్రోలు బంక్‌ సమీపంలో మంగళవారం రాత్రి మోటార్‌ సైకిల్‌ను లారీ ఢీకొన్న సంఘటనలో ఆరేపల్లి అనిల్‌కుమార్‌(31) మృతి చెందారు. అతడు కాతేరులోని తిరుమల స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని తిరిగి స్వగ్రామమైన ఐ.పంగిడి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ చేరుకునే సరికి అతడు చనిపోయినట్టు రూరల్‌ ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. అవివాహితుడైన అనిల్‌కుమార్‌ తండ్రి గతంలోనే మరణించారు. తల్లితో పాటు అతను కలిసి ఉంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో చికెన్‌ వ్యాపారి మృతి

రంగంపేట: విద్యుదాఘాతానికి గురై చికెన్‌ వ్యాపారి మృతి చెందినట్టు ఎస్సై తోట కృష్ణసాయి తెలిపారు. ఈలకొలను గ్రామానికి చెందిన కురుకూరి అన్నవరం(50) గ్రామంలో చికెన్‌ దుకాణం నడుపుతున్నాడు. బుధవారం ఉదయం తన భార్య మంగాదేవితో కలసి దుకాణానికి వెళ్లాడు. స్విచ్‌బాక్సును ముట్టుకోవడంతో అన్నవరంతో పాటు, అతని భార్య కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అన్నవరం మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. భార్య మంగాదేవి చికిత్స పొందుతోంది. మృతుడి కుమారుడు కురుకూరి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా 1
1/3

క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా

క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా 2
2/3

క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా

క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా 3
3/3

క్లాట్‌లో ‘డ్యాఫ్నీ’ విద్యార్థుల సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement