అట్టహాసంగా చైన్నె షాపింగ్ మాల్ ప్రారంభం
ప్రారంభించిన సినీ నటి శ్రీలీల
రాజమహేంద్రవరం సిటీ: వస్త్ర, బంగారు ఆభరణాల ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందిన చైన్నె షాపింగ్ మాల్ చారిత్రక రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చైన్నె షాపింగ్ మాల్‌ని బుధవారం సినీ నటి శ్రీలీల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, రూ.99 నుంచే వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, కాంబో ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు. బంగారు ఆభరణాలను అతి తక్కువ తరుగు, అలాగే మజూరి లేకుండా చైన్నె షాపింగ్ మాల్ అందిస్తోందని చెప్పారు. సినీ నటి శ్రీలీల మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ప్రాంత ప్రజలు వస్త్రాలు, బంగారు అభరణాలు కొనుగోలు చేయడానికి చైన్నె వెళ్లనవసరం లేకుండా, చైన్నె షాపింగ్ మాల్ వారి చెంతకు వచ్చిందన్నారు. నాణ్యతతో పాటు, నమ్మకమైనది చైన్నె షాపింగ్ మాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరయ్యారు. ఇంకా ప్రముఖులు చెరుకూరి కృష్ణాజీ, బుడ్డిగ శ్రీనివాస్, సూరవరపు శ్రీనివాస్, మన్యం ఫణి, భీమశంకరం, చలుమూరి శ్రీనివాస్, ఇన్నమూరి దీపు, పలువురు వ్యాపారవేత్తలు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment