ప్రయాణికులకు సెల్‌ఫోన్ల అప్పగింత
తుని: రైళ్లలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న ప్రయాణికులకు అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేసి అందజేశామని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపా రు. వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న 34 సెల్‌ఫోన్లను విజయవాడ రైల్వే ఎస్పీ, రాజమహేంద్రవరం డీఎస్పీ రత్నరాజు ఆదేశాల మేరకు బుధవారం తుని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో సంబంధిత వ్యక్తులకు అందజేశామన్నారు. వీటి విలువ రూ.7,04,600 ఉంటుందన్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment