టెన్త్‌లో నూరు శాతం ఫలితాలు
రాజానగరం: స్కేర్ట్ రూపొందించిన యాక్షన్ ప్లాన్‌ని అమలుచేస్తూ, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో నూరు శాతం ఫలితాలను సాధించే దిశగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ జి.నాగమణి అన్నారు. మండలంలోని మల్లంపూడి, సాయిమాధవి ఇంజినీరింగ్ కళాశాల భవనంలో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు పాఠశాల నాయకత్వ అభివృద్ధిపై ఇస్తున్న శిక్షణ తరగతులను మంగళవారం ఆమె సందర్శించారు. శిక్షణ తీరును పరిశీలించారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా ప్రధానోపాధ్యాయులు నాయకత్వ పటిమను పెంపొందించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఆశించిన అభ్యసనను అందిస్తూ, మంచి ఫలితాలను సాధించేలా కృషి చేయాలన్నారు. డ్రాపౌట్స్‌ని నివారించడంతోపాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కలిగించి, నిరంతరం పరిశీలన ఉండాలన్నారు. అకడమిక్ మానిటరింగ్ అధికారి గౌరీశంకరరావు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన 233 మంది ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
ఆర్‌జేడీ నాగమణి సూచన
Comments
Please login to add a commentAdd a comment