క్లాబాక్ కండిషన్ ఎత్తివేయాలి
రాజమహేంద్రవరం రూరల్: జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ)లో క్లాబాక్ కండిషన్ ఎత్తివేయాలని ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆలిండియా కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ డిమాండ్ చేశారు. మంగళవారం ఆలిండియా కమిటీ పిలుపుమేరకు ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయం పక్కన రాజమండ్రి డివిజన్ అధ్యక్షుడు వై.విశ్వేశ్వరరావు అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎల్.మంజునాథ మాట్లాడుతూ ఇటీవల ఎల్‌ఐసీ క్లాబాక్ స్ట్రక్చర్‌ను మార్చడం, మినిమం బీమా మొత్తాన్ని రూ.రెండు లక్షలకు పెంచడం, పాలసీలో వయోపరిమితిని తగ్గించడం, ప్రీమియం రేట్లు పెంచడం చేసిందన్నారు. సౌత్ సెంట్రల్ జోన్ జనరల్ సెక్రటరీ పీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ఎల్‌ఐసీ యాజమాన్యం ప్రవేశపెట్టిన నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజమండ్రి డివిజన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించేవిధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు టి.కోటేశ్వరరావు, జి.రవికోమధ్, సీఐటీయూ నాయకులు, వివిధ బ్రాంచిల యూనియన్ నేతలు, సుమారు 800 మంది ఏజెంట్లు పాల్గొన్నారు.
ఎల్‌ఐసీ ఏజెంట్స్ మహాధర్నాలో
ఆలిండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ
Comments
Please login to add a commentAdd a comment