మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కృషి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఔత్సాహిక పారిశ్రామికులుగా 5,000 మంది మహిళలను తీర్చిదిద్దే దిశగా సీటీఆర్‌ఐ న్యూఢిల్లీ గ్రామీణ ఫౌండేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నామని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ తెలిపారు. మంగళవారం స్థానిక కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (సీటీఆర్‌ఐ) కార్యాలయంలో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షుడిగా డాక్టర్ మాగంటి వ్యవహరించగా, గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శత్రుప కాశ్యప్ విచ్చేశారు. మూడేళ్లకు కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని స్వయం సహాయక బృందాలకు నైపుణ్య శిక్షణను కల్పిస్తామని శేషు మాధవ్ వివరించారు. సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు, కృషివిజ్ఞాన కేంద్రం, కలవచర్ల హెడ్ డాక్టర్ వీఎస్‌జీఆర్ నాయుడు, సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్టులు, గ్రామీణ ఫౌండేషన్ అధికారులు సమన్వయంతో మహిళలకు శిక్షణ ఇస్తారని వివరించారు. సీటీఆర్‌ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎల్.కె. ప్రసాద్, డాక్టర్ హెచ్. రవిశంకర్, డాక్టర్ బి.హేమ, కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ డాక్టర్ వీఎస్‌జీఆర్ నాయుడు, జేవీఆర్ సత్యవాణి, గ్రామీణ ఫౌండేషన్ అధికారులు పి.లక్ష్మి, ఎం.ఆనంద్ నాయక్ పాల్గొన్నారు.
గ్రామీణ ఫౌండేషన్ ఇండియా
ప్రైవేట్ లిమిటెడ్‌తో సీటీఆర్‌ఐ ఒప్పందం
Comments
Please login to add a commentAdd a comment