రైతుల పక్షాన పోరు
దేవరపల్లి: రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. దేవరపల్లిలోని కరుటూరి ఫంక్షన్ హాల్లో హోం శాఖ మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత అధ్యక్షతన బుధవారం పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వేణు ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ నిలుస్తుందన్నారు. అఽధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులను దగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లాలో ఈ నెల 13 నుంచి జనవరి 3వ తేదీ వరకు పార్టీ ఆధ్వర్యంలో వివిధ ఆందోళనలు చేపడుతున్నట్టు తెలిపారు. గురువారం రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి పార్టీ నాయకులు, రైతు సంఘాలతో ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బొమ్మూరులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్లమెంట్ నియోజకవర్గం ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, దేవరపల్లి, గోపాలపురం ఎంపీపీలు కేవీకే దుర్గారావు, ఉండవల్లి సత్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ, గోపాలపురం రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఆచంట అనసూయ, రాష్ట్ర అతిరాస కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇళ్ల భాస్కరరావు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చెలికాని రాజబాబు, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు మేడిబోయిన గంగరాజు, దేవరపల్లి సర్పంచ్ కడిమి వీరకుమారి, చాగల్లు మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్ర పాల్గొన్నారు.
రేపు ర్యాలీ, ధర్నా, కలెక్టర్‌కు
వినతిపత్రం అందజేత
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ
దేవరపల్లిలో సమావేశమైన పార్టీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment