‘హరి’కథ వింటే మంచిది
రాజమహేద్రవరం రూరల్: ’హరి’ కథ విన్నా, శ్రవణం చేసినా వారికి మంచి జరుగుతుందని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి అభిభాషించారు. హరికి సంబంధించిన కథలు భాగవతంలో ఎన్నో ఉన్నాయన్నారు. ఏడురోజుల్లో చనిపోతానని తెల్సిన పరీక్షిత్తు మహారాజు ఎలాగో చనిపోతాం కనుక ఏమిచేస్తే మంచిదని భావించి, అడిగితే ’హరి’ కథ వింటే మంచిదని శ్రీ శుకుడు చెబుతాడని ఆయన తెలిపారు. ఆ విధంగా ’హరి’కథ చెప్పడం శ్రీ శుకుడు మొదలుపెట్టాడని అన్నారు. రాజవోలు గాయత్రీనగర్ రామాలయం దగ్గర ఈ నెల 4వ తేదీ నుంచి అహోబిల రామానుజ జీయర్ స్వామి చేస్తున్న శ్రీ మద్భాగవత సప్తాహం దిగ్విజయంగా ముగిసింది. బుధవారం రామానుజ జీయర్ స్వామి భక్తులతో ఓం నమో భగవతే వాసుదేవాయ, జై శ్రీమన్నారాయణ జై జై, జై లక్ష్మీనారాయణ జై జై అని పలికింపజేశారు . శ్రీ మద్భాగవతంలో ఒక్క శ్లోకం అర్థం తెలిస్తేనే ఎంతో ఫలితం ఉంటుందని, అలాంటి భాగవతం ఏ కొంచెం చవిచూసినా మంచి ఫలాలు అందుతాయని అయన అన్నారు. ఇందులోని 12స్కంధాలు స్వామివారి అవయవాలని చెప్పారు. అనంతరం అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ రుక్మిణి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment