చేనేత సొసైటీని సందర్శించిన కేంద్ర బృందం
పెద్దాపురం: స్థానిక వీవర్స్ కో–ఆపరేటివ్ సోసైటీని బుధవారం కేంద్రం బృందం సందర్శించింది. ఢిల్లీకి చెందిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ డీపీఐఐటీ విభాగానికి చెందిన జస్మిన్ కౌర్, నిషేకత్ మిట్టల్ బృందం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్‌లో భాగంగా బృందం ఇక్కడ వస్త్ర తయారీ విధానంపై ఆరా తీసింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు వస్త్ర తయారీకి సంబంధించి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్‌కు ఎంపికై తే అంతర్జాతీయ స్థాయిలో చేనేత అమ్మకాలకు వీలుంటుందన్నారు దీనిపై మరింత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రానికి నివేదక ఇస్తామన్నారు. వారి వెంట రీజనల్ డైరెక్టర్ ధనుంజయరావు, జిల్లా ఏడీ పెద్దిరాజు, సొసైటీ మేనేజర్ తూతిక చంద్రశేఖర్, గాంధీ సొసైటీ మేనేజర్ దొరరాజు, తూతిక సత్యనారాయణ. మల్లిబాబు, బాబురావు, వెంకటరమణ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment