No Headline
విద్యా కానుక
జగనన్న విద్యాకానుక ద్వారా ఏటా స్కూల్ బ్యాగ్, యూనిఫాం, బెల్ట్, పాఠ్య, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీ వంటి వాటితో ప్రత్యేక కిట్ అందజేసేవారు. ఈవిధంగా జగన్ హయాంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 1.765 లక్షల మంది విద్యార్థులకు రూ.30.50 కోట్ల విలువైన వస్తువులు అందించారు.
కళాశాలల ఆధునీకరణ
అంతకుముందు కొన్నేళ్లుగా నిరాదరణకు గురైన ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి గత జగన్ ప్రభుత్వం నాంది పలికింది. జిల్లావ్యాప్తంగా 15 కళాశాలలను రూ.10.79 కోట్లతో ఆధునీకరించారు.
‘అమ్మ ఒడి’తో భరోసా
‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ద్వారా పేద విద్యార్థుల చదువులకు నాటి జగన్ సర్కార్ ఆర్థిక తోడ్పాటు అందించింది. పిల్లల చదువుల కోసం విద్యార్థుల తల్లులకు రూ.15 వేల ఆర్థిక సాయం అందజేసేవారు. ఈ విధంగా ఏటా జిల్లా వ్యాప్తంగా 1,55,769 మంది విద్యార్థులకు రూ.233.65 కోట్లు అందజేశారు. తద్వారా వారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చదువుకునేవారు.
వనతి దీవెన
జగనన్న వసతి దీవెన పథకం కింద జిల్లావ్యాప్తంగా 34,261 మంది విద్యార్థులకు చెందిన 30,559 మంది తల్లుల ఖాతాల్లో జగన్ సర్కార్ ఏటా రూ.32.61 కోట్లు జమ చేసేది.
బడుల రూపురేఖల మార్పు
‘మన బడి నాడు – నేడు’ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేశారు. తొలి విడతతో 414 పాఠశాలల్లో 1,006 పనులకు రూ.129.70 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో రూ.271 కోట్లు వెచ్చించి 665 పాఠశాలల్లో 996 అభివృద్ధి పనులు చేపట్టారు.
విద్యా దీవెన
జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు చెందిన 34,764 మంది పేద విద్యార్థులకు ఏటా రూ.32.74 కోట్లు అందజేశారు.
రుచికరంగా గోరుముద్ద
జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు రోజుకో మెనూతో నాణ్యమైన, రుచికరమైన, బలవర్థకమైన మధ్యాహ్న భోజనం పెట్టేవారు. ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,011 పాఠశాలల్లోని 1.26 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందేవారు. జగనన్న గోరుముద్ద పథకానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.11.64 కోట్లు వెచ్చించింది.
ప్రైవేటులోనూ రిజర్వేషన్
పేద విద్యార్థులకు ప్రైవేటు విద్యలో సైతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో 10 శాతం ఎస్సీలకు, 5 శాతం దివ్యాంగులకు కేటాయించింది. మరో 4 శాతం ఎస్టీలకు, బలహీన వర్గాలకు 6 శాతం సీట్లు ఇవ్వాలని ఆదేశించింది.
ప్లస్–2తో ప్రయోజనం
పదో తరగతి అనంతరం ఇంటర్ చదివేందుకు దూర ప్రాంతాలకు వెళ్లలేక గ్రామీణ విద్యార్థులు అనేక అవస్థలు పడేవారు. వారికి ఆ ఇబ్బందులను దూరం చేసే లక్ష్యంతో వారు ఉన్న ఊరికి సమీపంలోనే ఇంటర్ విద్యను అందించే బృహత్తర కార్యక్రమానికి నాటి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ప్రతి మండలంలోను ఒకటి చొప్పున ప్లస్–2 బాలికల జూనియర్ కాలేజీలు 15 ఏర్పాటు చేసింది.
బోధనలో స్మార్ట్
జిల్లాలోని 297 పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధనను జగన్ అమలు చేశారు. దీనికిగాను 1,099 స్మార్ట్ టీవీలు, 386 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ) అమర్చారు. వీటి సహాయంతో బోధించడం ద్వారా విద్యార్థులు మరింత సులభంగా పాఠ్యాంశాలు అర్థం చేసుకునే అవకాశం కలిగింది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో విద్యారంగానికి చేకూర్చిన లబ్ధి
పథకం లబ్ధిదారులు లబ్ధి
(రూ.కోట్లలో)
విద్యాదీవెన 70,241 142.99
వసతి దీవెన 69,098 65.56
అమ్మ ఒడి 1,56,000 234
జగనన్న విదేశీ విద్య 12 1.37
జగనన్న గోరుముద్ద 84,488 12.32
జగనన్న విద్యాకానుక 1,22,000 28.8
నాడు–నేడు పనులు 1,069 369.89
ప్రభుత్వ విద్యకు
నేడు ‘చంద్ర’గ్రహణం
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగానికి ‘చంద్ర’గ్రహణం పట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సకాలంలో పుస్తకాలే ఇవ్వలేకపోయింది. అవి కూడా చాలీచాలనట్టుగానే ఇచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటికే సిద్ధం చేసిన విద్యాకానుక కిట్లను పంపిణీ చేయడంలో సైతం కూటమి ప్రభుత్వం ఆపసోపాలు పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విద్యార్థులకు ట్యాబ్‌ల ఊసే లేదు. ఈ పరిస్థితిపై వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
·˘ ѧéÅ Æý‡…VýS…ÌZ ¯]l*™èl¯]l çÜ…çÜPÆý‡×æÌSMýS$
గత సీఎం జగన్ నాంది
·˘ Mö™èl¢ ç³#…™èlË$ ™öMìSP¯]l
ప్రభుత్వ విద్యా వ్యవస్థ
·˘ ѧéÅÆý‡$¦ÌSMýS$ ÐólÌê¨V>
ట్యాబ్‌ల అందజేత
·˘ IG‹œï³, ÝëÃÆŠ‡t sîæÒÌS §éÓÆ> »Z«§ýl¯]l
·˘ ¯éyýl$&¯ólyýl$™ø ºyýl$ÌSMýS$ Mö™èl¢ Æý‡*ç³#
·˘ AÐ]l$à Jyìl, ѧéÅ, Ð]lç܆ ©Ððl¯]lÌS™ø
పేదల చదువులకు ప్రోత్సాహం
·˘ ¯ólyýl$ B ѧéÅ {糧é™èl f¯]lè¯]l…
‘పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందీ అంటే అది చదువే’ అని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్రికరణ శుద్ధిగా నమ్మారు. ఎక్కడ ఏ సభ జరిగినా, సమావేశం జరిగినా.. ఈ విషయాన్ని పదేపదే చెప్పేవారు. పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పరితపించేవారు. ఆ తపనతోనే తన హయాంలో ప్రభుత్వ విద్యారంగంలో సరికొత్త మార్పులు తీసుకుని వచ్చారు. అప్పటి వరకూ ప్రభుత్వ బడులంటే ఉన్న చిన్నచూపును పోగొట్టారు. ‘నాడు – నేడు’తో పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేశారు. చదువులను డిజిటల్ బాట పట్టించి.. స్మార్ట్‌గా మార్చారు. అమ్మ ఒడి, విద్యా, వసతి దీవెనలతో పేద పిల్లల ఉన్నత చదువులకు తోడ్పాటునందించారు. గోరుముద్దతో రుచికరమైన పౌష్టికాహారం అందించారు. విద్యా కానుక ద్వారా సకాలంలో నోట్, పాఠ్య పుస్తకాలు అందజేశారు. కళాశాలల ఆధునీకరణకు సైతం నాంది పలికారు. ప్లస్–2తో ఉన్న ఊళ్లోనే ఇంటర్ విద్య చదువుకునే అవకాశం కల్పించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అడ్మిషన్ల సమయంలో హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ బడులను తీసుకుని వెళ్లారు. వెరసి విద్యాప్రదాతగా ఖ్యాతి గడించారు.
నేడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన హయాంలో ప్రభుత్వ విద్యారంగంలో వచ్చిన వినూత్న మార్పులపై సింహావలోకనం... – సాక్షి, రాజమహేంద్రవరం
Comments
Please login to add a commentAdd a comment