టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
కొవ్వూరు: టీడీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొవ్వూరులో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్టీ సమావేశం దీనికి వేదిక అయ్యింది. మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు ఎస్.రాజీవ్‌కృష్ణ ఇటీవల వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. గడచిన ఐదేళ్లూ టీడీపీ నాయకులను కేసులతో వేధించారంటూ ఆయనను, ఆయన అనుచరులను పార్టీలో చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. రాజీవ్‌కృష్ణ చేరికపై స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును, టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులను పలువురు నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకుని తమపై పెత్తనం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్‌కృష్ణ వంటి వారిని చేర్చుకోవడం ద్వారా పార్టీలో కొత్త సమస్యలు వస్తాయన్నారు. ఇప్పటికే కలిసికట్టుగా ఉన్న పార్టీలో మరోసారి విభేదాలు తలెత్తక ముందే అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీవ్‌కృష్ణ ఇటీవల ఏటిగట్టుపై భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిలో మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ ఫొటో వేసి, ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమని రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఫొటోలు వేయకపోవడంపై తమ్ముళ్లు మండిపడ్డారు. అరుపులు, కేకలతో సమావేశం ఆద్యంతం గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కలగజేసుకుని పార్టీ కార్యకర్తల ఆవేదనను ముఖ్య నాయకులైన అచ్చిబాబు దృష్టికి, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
రాజీవ్‌కృష్ణ చేరికతో..
టీడీపీలో రాజీవ్‌కృష్ణ చేరిక ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టినట్టయ్యింది. రాజీవ్ కృష్ణ రాకను ఆయన మామ కృష్ణబాబుకు స్వయనా సోదరుడైన అచ్చిబాబు విభేదిస్తునట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాజీవ్‌కృష్ణ చేరిక సమయంలో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా చెప్పుకునే పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చిబాబు) దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గ టీడీపీ మూడు గ్రూపులతో సతమతమవుతోంది. ఇప్పుడు రాజీవ్‌కృష్ణ చేరికతో మరో గ్రూపు పురుడు పోసుకున్నట్లయ్యింది. ఇటీవల అచ్చిబాబుకు, రాజీవ్‌కృష్ణకు మధ్య సఖ్యత లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజీవ్‌కృష్ణ చేరికను అడ్డుకునేందుకు అచ్చిబాబు వర్గీయులు చివరి వరకూ ప్రయత్నాలు చేశారు. దీంతో నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, ఎంపీ భరత్ ద్వారా అధిష్టానం వద్ద రాజీవ్‌కృష్ణ పావులు కదిపారు. భరత్ ద్వారా లోకే ష్‌ను ఒప్పించుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లూ నియోజకవర్గ టీడీపీలో అచ్చిబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు రాజీవ్‌కృష్ణ చేరికతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
జవహర్ వర్గం మద్దతుతో పితలాటకం
Cç³µ-sìæMóS MöÐ]lNÓÆý‡$ sîæyîl-ï³ÌZ Ð]l*i Ð]l$…{† fÐ]lçßæ-ÆŠ‡MýS$, A_a-»ê-º$MýS$ Ð]l$«§ýlÅ OÐðlÆý‡… ¯]lyýl$-Ýù¢…-¨. VýS™èl…ÌZ A_a-»ê-º$Oò³ fÐ]l-çßæÆŠ‡ ºíßæ-Æý‡…VýS ÑÐ]l$-Æý‡ØË$ ^ólÔ>Æý‡$. D ¯ólç³-£ýlÅ…ÌZ VýS™èl Æð‡…yýl$ G°²-MýSÌZÏ fÐ]lçßæ-ÆŠ‡MýS$ MöÐ]lNÓÆý‡$ sìæMðSr$t §ýlMýSP-MýS$…yé A_a-»êº$ Ayýl$z-MýS$-¯é²Æý‡$. C糚yýl$ Ð]l*Ð]l* AË$ÏâýæÏ Ð]l$«§ýlÅ çÜQÅ™èl ÌôæMýS-´ùÐ]l-yýl…™ø fÐ]l-çßæÆŠ‡ Ð]lÈYĶæ¬Ë$ Æ>i-ÐŒæ-MýS–-çÙ~MýS$ »êçÜ-rV> °Í-^éÆý‡$. °Äñæ*-f-MýSÐ]l-Æý‡Y…ÌZ ´ëÈt° ¯]lyìl-í³-çÜ$¢¯]l² ¨Ó-çÜ¿ýæÅ MýSÑ$sîæ çÜ¿¶æ$ÅË$ OòÜ™èl… Æ>i-ÐŒæ-MýS–çÙ~ ^ólÇ-MýSMýS$ Aç³µsZÏ àfÆý‡$ M>MýS-´ùÐ]lyýl… çÜÆý‡Ó{™é ^èlÆý‡a-±-Ķæ*…-ÔèæOÐðl$…¨. A§ól çÜÐ]l$-Ķæ$…ÌZ Æ>i-ÐŒæ-MýS–çÙ~ ^ólÇ-MýSMýS$ fÐ]l-çßæÆŠ‡ ™èl¯]l-Ķæ¬yýl$, Æ>çÙ‰ ™ðlË$VýS$ Ķæ¬Ð]l™èl E´ë-«§ýlÅ-„ýS$yýl$, ´ëÈt Æ>gê¯]l-VýSÆý‡… °Äñæ*-f-MýS-Ð]lÆý‡Y ç³Ç-Ö-ÌSMýS$yýl$ BÕ‹-Ù-ÌêÌŒæ àfÆý‡$ M>Ð]lyýl…Oò³ Aç³µsZÏ ò³§ýlª §ýl$Ð]l*Æý‡… Æó‡W…-¨. sîæyîl-ï³ÌZ ^ólǯ]l A¯]l…-™èlÆý‡… MöÐ]lNÓÆý‡$ Ð]l_a¯]l Æ>i-ÐŒæMýS–-çÙ~¯]l$ fÐ]l-çßæÆŠ‡ Ð]lÈYĶæ¬-ÌS…-§ýlÆý‡* MýSÍíÜ ç³#çÙµ-VýS$-^éeË$ A…¨…-_, Ð]l$§ýlª™èl$ ™ðlÍ-´ëÆý‡$. D ç³Ç-×êÐ]l$… GÐðl$ÃÌôæÅ, A_a-»êº$ Ð]lÈYĶæ¬-ÌSMýS$ Ñ$…VýS$-yýl$-ç³-yýl-Ìôæ§ýl$. GÐðl$ÃÌôæÅ Ð]l¬í³µyìlMìS MöÐ]lNÓÆý‡$ sìæMðSr$t QÆ>Æý‡$ ^ólíܯ]l çÜÐ]l$-Ķæ$…-ÌZ¯]l*, G°²MýS-ÌZϯ]l$ fÐ]l-çßæÆŠ‡ çÜçßæ-MýS-Ç…^èlÌôæ§ýl$. ºíßæ-Æý‡…-VýS…-V>¯ól BĶæ$-¯]lOò³ ÑÐ]l$-Æý‡ØË$ çÜ…«¨…-^éÆý‡$. ©…™ø ÒǧýlªÇ Ð]l$«§ýlÅ Ñ¿ôæ§éË$ HÆý‡µyézƇ$$. Ððl¬™èl¢…- Ò$§ýl fÐ]l-çßæÆŠ‡ Ð]lÆý‡Y… Æ>i-ÐŒæ-MýS–çÙ~ ^ðl…™èlMýS$ ^ólÆý‡yýl… Æ>f-MîSĶæ$ §ýl$Ð]l*-Æ>-°MìS M>Æý‡-×æ-OÐðl$…-¨. D ç³Ç-×ê-Ð]l*Ë$ Æ>¯]l$¯]l² ÆøkÌZÏ Ð]l*Ð]l* AË$ÏâýæÏ çÜÐé-ÌŒæMýS$ §éÇ ¡õÜ AÐ]l-M>Ôèæ… E…§ýl° ç³Ç-Ö-ÌS-MýS$Ë$ ˘¿êÑ-çÜ$¢-¯é²Æý‡$.
ఫ రాజీవ్‌కృష్ణ రాకను
విభేదిస్తున్న తమ్ముళ్లు
ఫ రసాభాసగా పార్టీ కొవ్వూరు
నియోజకవర్గ సమావేశం
ఫ మళ్లీ తెరపైకి గ్రూపు రాజకీయాలు
ఫ రాజీవ్‌కృష్ణ ఫ్లెక్సీ బ్యానర్లపై
జవహర్ ఫొటో వేయడంపై దుమారం
ఫ ద్విసభ్య కమిటీ సభ్యుల ఫొటోలు
లేకపోవడంపై కార్యకర్తల మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment