బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు
గత సీఎం జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఏటా డిసెంబర్ 21న క్రమం తప్పకుండా బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేసేవారు. 2022–23 విద్యా సంవత్సరంలో 15,291 మంది విద్యార్థులకు, 2,445 మంది ఉపాధ్యాయులకు వీటిని అందించారు. 2023–24లో 15,332 మంది 8వ తరగతి విద్యార్థులకు 5,510 ట్యాబ్‌లు అందజేశారు. కొత్తగా చేరిన 181 మంది 9వ తరగతి విద్యార్థులకు సైతం వీటిని ఇచ్చారు. ఈ ట్యాబ్‌లలో ఈ–పాఠశాల యాప్ ద్వారా 3వ తరగతి నుంచి ఇంటర్ వరకూ పాఠాలను అప్‌లోడ్ చేశారు. విద్యార్థులు తమ సందేహాలను దృశ్యరూపంలో తీర్చుకునేలా, పాఠ్యాంశాలను మరింత సులభంగా అర్థం చేసుకునేలా ఈ ట్యాబ్‌లు ఎంతో ఉపయోగపడేవి. తమ పిల్లలు టిప్‌టాప్‌గా మంచి యూనిఫాం, చేతిలో ట్యాబ్‌తో పాఠశాలకు వెళ్తుంటే చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు.
Comments
Please login to add a commentAdd a comment