టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత రావాలి : కలెక్టర్ ప్రశాం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. విద్యా శాఖ ప్రగతి లక్ష్యాలపై సంబంధిత శాఖల జిల్లా, డివిజన్, మండలం స్థాయి అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బోధన విషయంలో నిరక్ష్యం వహించే ఉపాద్యాయులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి 15 రోజులకోసారి విద్యా ప్రగతిపై సమీక్షలు నిర్వహిస్తామని, లక్ష్య సాధనలో వెనుకబడినవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ వివిధ అంశాలపై ప్రగతి నివేదికలు సమర్పించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఆయా ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు మాట్లాడుతూ, పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించే దిశగా 100 రోజులు అదనపు తరగతులు నిర్వహించి, విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన చేస్తున్నామని చెప్పారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు లక్ష్యాలు ఇచ్చామని, విద్యార్థులను మ్యాపింగ్ చేశామని తెలిపారు.
స్పెషల్ బ్రాంచ్
డీఎస్పీగా రామకృష్ణ
కంబాలచెరువు
(రాజమహేంద్రవరం): జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా బి.రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. 1991 బ్యాచ్‌కు చెందిన రామకృష్ణ గతంలో కోనసీమ జిల్లా రామచంద్రపురం ఎస్‌డీపీవోగా పనిచేశారు.
ప్రజల మనిషి సుందరయ్య
సీపీఎం జిల్లా మహాసభల
ప్రారంభోత్సవ సభలో వక్తలు
పెద్దాపురం: కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్య ప్రజల మనిషి అని పలువురు వక్తలు కొనియాడారు. సీపీఎం జిల్లా మహాసభల సందర్భంగా స్థానిక వరహాలయ్యపేటలోని యాసలపు సూర్యారావు భవనంలో శుక్రవారం సుందరయ్య జీవిత విశేషాలతో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. దీనిని సీపీఎం సీనియర్ నాయకుడు టీఎస్ ప్రకాష్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన, సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు బేబీరాణి మాట్లాడుతూ, నిత్యం ప్రజల కోసమే ఆలోచించిన వ్యక్తి సుందరయ్య అని అన్నారు. ఉద్యమమే ఊపిరిగా నిస్వార్థ నాయకుడిగా ఎదిగిన ఆయన ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లి, కమ్యూనిస్టు గాంధీగా పేరొందారని, కమ్యూనిస్టులు ఎంత నిస్వార్థంగా పని చేస్తారో చెప్పడానికి సుందరయ్య జీవితమే ఉదాహరణని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు, నాయకులు నీలపాల సూరిబాబు, గడిగట్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment