జెండా పాతిన బరితెగింపు
సామర్లకోట: మండల పరిధిలో వీకే రాయపురం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలకు రంగం సిద్ధం అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన నాయకులు కలిసి కోడిపందేలు నిర్వహించాలని భావించారు. అయితే తెలుగుదేశం నాయకులు ప్రత్యేకంగా కోడిపందేలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దాంతో జనసేన గ్రామ నాయకుడు పెదిరెడ్ల కొండలరావు ఆధ్వర్యంలో కోడిపందేలకు బరి తయారు చేస్తున్నారు. జనసేన నాయకులకు పార్టీ అధ్యక్షుడు తుమ్మలబాబు అండ ఉండటంతో జనసేన నాయకులు ఉత్సాహంగా కోడి పందేల బరి తయారు చేయడంతో పాటు ఆ బరి వద్ద జనసేన జెండా ఏర్పాటు చేశారు. దాంతో తెలుగుదేశం, జనసేన నాయకుల్లో విభేదాలు పొడచూపుతున్నాయి.
ట్రాక్టరు సాయంతో తయారు చేసిన
బరిలో పాతిన జనసేన జెండా
Comments
Please login to add a commentAdd a comment