నిరంతర కృషితో లక్ష్య సాధన
రాజమహేంద్రవరం రూరల్: దేశ వ్యాప్తంగా జరిగిన నీట్–2024 పరీక్షలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులై 204 మంది విద్యార్థులు వివిధ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించడం సంతోషదాయకమని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. తిరుమల రాజమహేంద్రవరం క్యాంపస్‌లో జరిగిన మెడ్‌సినాప్స్–2024 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతర కృషి, పట్టుదల కావాలన్నారు.
చైన్నై శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ కె.బాలాజీసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డాక్టర్ వృత్తిలో ఎంతో నిబద్ధతతో పని చేయాలని, మీరందరూ రాబోయే కాలంలో డాక్టర్లుగా అందరికీ సేవ చేయాలని తెలిపారు. ప్రముఖ యురాలజిస్ట్ డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులు సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉండాలని, పెద్దలతో గౌరవంగా మెలగాలన్నారు. కంటి వైద్య నిపుణుడు నాగేంద్రబాబు మాట్లాడుతూ ఒకే క్యాంపస్ నుంచి 204 మంది డాక్టర్లను అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. నున్న కృషీధరరావు మాట్లాడుతూ డాక్టర్ వృత్తిలో రీసెర్చ్ పెరగాలని, సాంకేతికతను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం నున్న తిరుమలరావు వైద్యులచే విద్యార్థులకు స్టెతస్కోప్, షీల్డ్‌లను బహూకరించారు. ఈ ఆకంమక్రమంలో డైరెక్టర్ సరోజినిదేవి, ప్రిన్సిపాల్ శ్రీహరి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment