రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
ఫ దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరిపై కొలువైన వీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచే భక్తుల రద్దీ ఆరంభమైంది. సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం రాత్రి రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధువులు, ఇతర భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులకు భోజనం పెట్టారు.
కన్నుల పండువగా రథోత్సవం
ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. ఆ రథంపై స్వామి, అమ్మవార్ల విగ్రహాలను వేంచేయించి, పూజలు చేశారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్‌రావు రథోత్సవాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వెంట రాగా ఆలయ ప్రాకారంలో రథోత్సవం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment