ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): యాక్సెంచర్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన 141 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయని ఆ కళాశాల అకడమిక్ డైరెక్టర్ బీఈవీఎల్ నాయుడు బుధవారం తెలిపారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ సీఎమ్‌ఎమ్ లెవల్ ఐదు సాఫ్ట్‌వేర్ కంపెనీ యాక్సెంచర్ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థులకు ఏడాదికి రూ.3.5 లక్షల వార్షిక వేతనం లభిస్తుందని కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు తెలిపారు. ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల సెక్రటరీ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి మాట్లాడుతూ డిగ్రీ కళాశాలల చరిత్రలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించడం కేవలం ఆదిత్యకే సాధ్యమన్నారు. విజేత విద్యార్థులు, శిక్షణ ఇచ్చిన అధ్యాపక బృందాన్ని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, డిగ్రీ కళాశాలల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు, ప్రిన్సిపాల్స్ కె.కరుణ, డి.బ్యూలా, ఎండీ షాహిద్దీన్, సీహెచ్ ఫణికుమార్, షేక్ రెహమాన్, డి.రామకృష్ణ, ప్లేస్‌మెంట్ కో ఆర్డినేటర్ వీఎస్‌ఎన్ కిశోర్ తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment