ప్రమాదంతో చెట్టాపట్టాలు!
మహారాష్ట్రలో బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో 12 మంది పట్టాలపై ప్రాణాలు కోల్పోయినా జనం ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు. తోటివారికన్నా ముందుండాలని, సమయం కలిసొస్తుందని రైల్వే ఓవర్ బ్రిడ్జిలను ఉపయోగించకుండా పట్టాలను దాటేస్తున్నారు. రైల్వే అధికారులు చేసే హెచ్చరికలను, ఇచ్చే సూచనలను పెడచెవిన పెట్టి అయినవారిని దుఃఖసాగరంలో ముంచే ఈ కంగారు అవసరమా అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా గురువారం వివిధ స్టేషన్లలో ప్రయాణికులు ప్రాణాలు పణంగా పెట్టి ఇలా పట్టాలు దాటారు.
Comments
Please login to add a commentAdd a comment