ఏలూరు మార్టెట్‌యార్డ్ పోలింగ్ కేంద్రంలో సూచనలిస్తున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ఏలూరు(మెట్రో): ప్రత్యేక ఓటర్ల నమోదులో భాగంగా శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ వారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఏలూరులోని కస్తూరిబా నగరపాలక ఉన్నత పాఠశాల, బీజీపీఓ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, చాటపర్రు జెడ్పీ హైస్కూల్‌లో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ముదినేపల్లి మండలంలో డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, కొయ్యలగూడెం మండలంలో డీఈఓ శ్యాంసుందర్, ద్వారకాతిరుమల మండలంలో గుణ్ణంపల్లి, నారాయణపురంలో పశుసంవర్ధక శాఖ జేడీ జి.నెహ్రుబాబు, దెందులూరు మండలం సోమవరప్పాడులో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్‌ఎస్ కృపావరం, పెదపాడులో డీపీఓ శ్రీనివాస విశ్వనాథ్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులను పరిశీలించి బీఎల్‌ఓలకు సూచనలు ఇచ్చారు. ఆదివారం కూడా ప్రత్యేక ఓటర్ల నమోదు నిర్వహించాలన్నారు.
స్వచ్ఛ ఓటర్ల జాబితా లక్ష్యం
అర్హులైన ప్రతిఒక్కరూ ఈనెల 9లోపు ఓటు నమో దు చేసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అ న్నా రు. ఏలూరు కలెక్టరేట్‌లో రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ, ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలపై సమీక్షించారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడం లక్ష్యమని ఇందు కు అందరూ సహకరించాలని కోరారు. ఓటరు న మోదు నిరంతర ప్రక్రియ అయినా జనవరి 5న ప్రకటించే తుది ఓటరు జాబితాలో ఓటరుగా ఉండాలంటే తప్పనిసరిగా ఈనెల 9లోపు నమోదు చేసుకోవాలన్నారు. ఓటరు నమోదుకు సంబంధించి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నా రు. అర్హులందరినీ ఓటరుగా నమోదు చేయడంపై రాజకీయ పక్షాల ప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment