హెచ్‌ఎం, వంట సిబ్బందిపై చర్యలు
దెందులూరు: జోగన్నపాలెం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిని 9 మంది వి ద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణమైన హెచ్‌ఎం, మధ్యాహ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకున్నామని డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ కె.అన్నమ్మ తెలిపారు. నిబంధనలు పట్టించుకోని హెచ్‌ఎంకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం పాఠశాలలో భోజనాన్ని స్వయంగా తాను రుచి చూసి నాణ్యతను పరిశీలించానని ఎంఈఓ అన్నమ్మ అన్నా రు. భోజనం చేసిన తర్వాత విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు. అనంతరం డీఈఓ, ఎంఈఓ ఏలూరులో చికిత్స పొందుతున్న పాఠశాల విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే ఇంటి వద్ద చికిత్స పొందుతున్న విద్యార్థులను గురువారం తహసీల్దార్ బి.సుమతి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ప్రతి రెండు గంటలకో సారి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తనకు రి పోర్ట్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
‘నవోదయ’ దరఖాస్తులకు గడువు పెంపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 9,11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్టు డీఆఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. అలాగే దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఈనెల 27,28 తేదీల్లో అవకాశంలుంటుందని పేర్కొన్నారు. వచ్చే ఫిబ్రవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో సర్వీస్, కుటుంబ పెన్షనర్లు తమ వార్షిక ధ్రు వీకరణ పత్రం (లైఫ్ స ర్టిఫికెట్)ను ఏటా జ నవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోపు ఉప ఖజానా కార్యాలయంలో సమర్పించాలని జిల్లా ఖజానా, లెక్కల శాఖ అధికారి టి.కృష్ణ గురువారం ప్రకటనలో తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్‌ను జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా సమర్పించవచ్చన్నారు. 2025కి సంబంధించి లైఫ్ సర్టిఫికెట్‌ను జనవరి 1 నుంచి మాత్రమే సమర్పించాలని, ముందుగా సమర్పించినవి పరిగణనలోకి తీసుకోమన్నారు.
సోషల్ మీడియా కార్యకర్త సతీష్‌పై కేసు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లాలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి నేతల కేసులు, వేధింపులు ఆగడం లేదు. ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమర్రు మండలం చానమల్లికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త బౌతు సతీష్‌పై టీడీపీ నేతల ఫిర్యాదుతో భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సతీష్ పోస్టులు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నాడంటూ టీడీపీ భీమడోలు మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కమ్మ పద్మా వతి ఈనెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గు రువారం సతీష్‌ను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సతీష్ పోస్ట్ పెట్టినందుకుగాను కేసు పెట్టారు. సతీష్ అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మకు పితృవియోగం
భీమవరం: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తండ్రి సూర్యనారాయణరాజు (91) గురువారం మృతి చెందారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన్ను భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సూర్యనారాయణరాజుకు భార్య, కుమారుడు, ము గ్గురు కుమార్తెలు ఉన్నారు. సూర్యనారాయ ణరాజు భౌతిక కాయాన్ని శుక్రవారం ఉదయం నర్సయ్య అగ్రహారంలోని స్వగృహం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యా హ్నం 1 గంటకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.
మధ్యాహ్న భోజనాన్ని రుచి చూస్తున్న ఎంఈఓ అన్నమ్మ
Comments
Please login to add a commentAdd a comment