సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు
కలెక్టర్ వెట్రి సెల్వి
ఏలూరు(మెట్రో): జిల్లాలో రానున్న రబీ సీజన్‌లో సాగునీరు, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ రబీ సీజన్‌లో పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో 82,251 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. సాగు, తాగునీటి అవసరాలరకు 91.35 టీఎంసీలు అవసరం కాగా 68.40 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. రబీ పంటకు సాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు అమలు చేయాలన్నారు. పశ్చిమ డెల్టా ఆయకట్టు పరిధిలో కాలువలను వచ్చే ఏప్రిల్ 15న మూసివేయాలని, జూన్ 1న తిరిగి కాలువలకు నీటిని విడుదల చేయాలని తీర్మానించామన్నారు. జిల్లాలో మైనర్, మేజర్ నీటివనరులకు మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే మహాశివరాత్రికి బలివే పుణ్యక్షేత్రానికి తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుంచి 50 ఎంసీఎఫ్‌టీ నీటిని ఐదు రోజులపాటు సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఈ దేవప్రకాష్, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ త్రినాథబాబు, మత్య్సశాఖ జేడీ నాగలింగాచార్యు లు, అధికారులు పాల్గొన్నారు.
ఉద్యాన సాగులో వృద్ధి సాధించాలి
జిల్లాలో ఉద్యాన పంటల సాగులో 20 శా తం వృద్ధిరేటు సాధించడానికి రైతులకు అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్‌లో సుస్థిర ఆయిల్‌పామ్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఆయిల్‌పామ్ సాగులో దేశంలోనే ప్ర థమ స్థానంలో ఉందని, సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలన్నారు. ఆయిల్‌పామ్ సా గులో అంతరపంటలుగా కోకో, బ్లాక్ పెప్పర్ వంటివి పండించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ఉద్యాన శాఖ డీడీ ఎస్.రామ్మోహన్ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగులో సూక్ష్మ, బిందు సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అనంతరం ఆయిల్‌పామ్‌లో అధిక దిగుబడుల సాధనకు కృషి చేసిన రైతులు, శాస్త్రవేత్తలను సన్మానించి మెమెంటోలను అందజేశారు. సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ హిమాన్షు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి రవికుమార్, ఆయిల్‌పామ్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కె.సురేష్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్‌లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment