టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధం
ఏలూరు(మెట్రో): జిల్లాలో డిసెంబర్ 5న జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ కె.వెట్రి సెల్వి తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలోని 20 పోలింగ్ కేంద్రాలలో జరుగుతాయన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 9న చేపడతారని, 12 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. జిల్లాలో 2,605 మంది ఓ టర్లు ఉన్నారని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు 144 మంది సిబ్బందిని నియమించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించామన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పటిష్ట బందోబస్తు
జిల్లా ఎస్పీ శివకిశోర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. అనధికార వ్యక్తులు పోలింగ్ బూత్‌లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గత పదేళ్లలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు స మస్యలు కలిగించిన వారిని గుర్తించి, వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సమావేశంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, వాణి, ఎంవీ రమణ, ఎల్‌డీఎం నీలాద్రి, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
20 కేంద్రాలు.. 2,605 మంది ఓటర్లు
కలెక్టర్ వెట్రి సెల్వి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment