18,000
జిల్లాలో వసతి గృహాలు
ఏలూరులోని ఏటిగట్టు హాస్టల్‌లో స్నానాల గదుల తలుపుల దుస్థితి
అధ్వానంగా హాస్టల్ పరిసరాలు
ఏలూరు (మెట్రో) : జిల్లావ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు అరకొర సౌకర్యాలతో విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ఏ వసతిగృహాన్ని చూసినా ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వసతి గృహాల్లో కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా కల్పించని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మరుగుదొడ్లకు తలుపులు లేక, నీటి సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కుళాయిలు ఉన్నా నీటి లీకేజీలతో దర్శనమిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమం, ఎస్సీ, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్, సంక్షేమ గు రుకుల హాస్టళ్లు ఉన్నాయి. జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు 58, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు 38 ఉన్నాయి. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆరు గురుకులాలు, ఒక ఏకలవ్య సంక్షేమ హాస్టల్ మొత్తంగా ఏడు వసతి గృహాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని హాస్టళ్లలో మొత్తంగా సుమారు 18 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు.
● ఏలూరులో బీసీ బాలికల వసతి గృహం పూర్తిగా శిఽథిలావస్థకు చేరుకుంది. చిన్నారులు అరకొర వసతులతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. విద్యార్థినులను పక్క భవనంలోకి మార్చినా అక్కడా పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. శిథిల భవనంలో టార్ఫాలిన్ పట్టాలు కట్టి వంట గదులను ఏర్పాటు చేయడం దుస్థితికి అద్దం పడుతోంది.
● దెందులూరు మండలం కొవ్వలిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. గతంలో 400 మందితో ఉండే వసతి గృహంలో ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారు. ఈ వసతి గృహంలో తాగునీటికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు మరుగుదొడ్లకు కనీసం తలుపులు లేకపోవడం గమనార్హం. ఇక హాస్టల్ చుట్టూ పారిశుద్ధ్యం క్షీణించింది.
● శింగవరంలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం శ్లాబ్ పెచ్చులూడి ఎప్పుడు పడిపోతుందో తెలియక చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో సుమారు 100 మంది బాలికలు పక్కనే ఉన్న ఉన్నత పాఠశాలల్లో నిద్రపోతున్నారు.
● కై కలూరు బీసీ బాలుర వసతి గృహంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక్కడ మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగు పర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
● భీమడోలు మండలం పోలసానిపల్లి గురుకుల పాఠశాలలో 750 మంది విద్యార్థులకు ఒకే డైనింగ్ హాలు ఉంది. భోజన విరామం గంట మా త్రమే ఉండటంతో విద్యార్థులు బ్యాచ్‌ల వారీగా వచ్చి హడావుడిగా భోజనాలు చేస్తున్నారు. ప్రశాంతంగా భోజనం చేసేందుకు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు.
నిత్యం.. భయం భయం
జిల్లా కేంద్రం ఏలూరులోని కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఏటిగట్టుపై ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 70 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. హాస్టల్‌లో పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. అలాగే హాస్టల్‌లో గదులు కుంగిపోయి విద్యార్థులు నడిచేందుకు వీలులేకుండా ఉంది. ఎక్కడ అడుగేస్తే ఏ ప్రమాదం పొంచి ఉందో అనే భయంతో విద్యార్థులు కాలం గడుపుతున్నారు. గదుల్లో నేల కుంగిన చోట విషసర్పాలు, తేళ్లు, జెర్రులు వస్తాయనే ఆందోళనలో ఉన్నారు. ఇక్కడ మరుగుదొడ్లు సమస్య వర్ణనాతీతంగా ఉంది. మరుగుదొడ్లకు తలుపులు లేవు. అలాగే నీటి కుళాయిలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. దీంతో బట్టలు ఉతుక్కునేందుకు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు కటికి నేలపైనే నిద్రించాల్సిన దుస్థితి. అసలే చలికాలం కావడంతో విద్యార్థులు చలికి వణుకుతూ నిద్రపోతున్నారు.
సంక్షామ గృహాలు
క్షీణించిన పారిశుద్ధ్యం
కానరాని సంక్షేమం
అధ్వానంగా మరుగుదొడ్లు
కుంగుతున్న గదులు
పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం
సమస్యల వలయంలో హాస్టళ్లు
సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు 58
బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు 38
ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లు 7
మొత్తం విద్యార్థులు
సుమారు
Comments
Please login to add a commentAdd a comment