అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్టు
ప్రకాశం జిల్లాలో అంతర్రాష్ట్ర నేరస్తుడిను అరెస్ట్ చేశారు. ఇతనిపై విశాఖపట్నం, గుంటూరు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో 20 కేసులు నమోదయ్యాయి. 8లో u
రోడ్డు భద్రతా నియమాలు
పాటించాలి
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్లు ఉపయోగించేలా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత నెలలో హెల్మెట్ వినియోగంపై నిర్వహించిన తనిఖీల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం ప్రమాద బాధితులను సకాలంలో కాపాడిన వ్యక్తిని సత్కరిస్తామన్నారు. ఎస్పీ కె .ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు బహుముఖ వ్యూహం అనుసరించాలన్నారు. సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యానికి గురి చేసే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు సైలెన్సర్‌లు తొలగించే మెకానిక్ షాపులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఉప రవాణా కమిషనర్ కరీం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment