దళారుల మాటలు నమ్మొద్దు
ద్వారకాతిరుమల: దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొని మోసపోవద్దని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి రైతులకు సూచించారు. నారాయణపురంలో రైతు సేవ కేంద్రాన్ని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా రైతులను మభ్యపెట్టి అక్రమంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తమ దృష్టికి వస్తే మధ్యవర్తులపై కఠిన చర్యలు చేపడతామన్నారు. అనంతరం ధాన్యం సేకరణ తీరుతెన్నులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవీ సుబ్బారావు, మండల వ్యవసాయ శాఖాధికారి ఎ.దుర్గారమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment