సమగ్ర కులగణన చేయాలి
ఏలూరు (టూటౌన్): జనగణనలో సమగ్ర కులగణన జరపాలని బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరిటికట్ల త్యాగ రాజాచారి కోరారు. స్థానిక అమీనాపేట ఏటిగట్టులోని జిల్లా యాదవ సంఘం కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన బీసీ చైతన్య వేదిక ముఖ్యనాయకుల సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ 2025లో జరిగే సెన్సెస్‌లో జిల్లాల వారీగా సమగ్ర కులగణన జరగాలని, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు స్వతంత్య్రంగా అన్ని రంగాల్లో ఎదగాలని, ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా బోదూరి హరి ప్రసాదాచారి, ప్రధాన కార్యదర్శిగా ఇళ్ల వరప్రసాద్, నగర అధ్యక్షుడిగా నక్కా వరప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చిదరబోయిన శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శిగా కిలారపు శ్రీనివాసరావు, యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లిపూడి రాజు యాదవ్, ఏలూరు జిల్లా యూత్ అధ్యక్షుడిగా బలే గౌరీ శంకర్‌లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment