అన్నదాతలకు అండగా.. పోరుబాట
రైతన్నలకు బాసటగా వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది.. కూటమి సర్కారు రైతుల నడ్డివిరిచేలా వ్యవహరిస్తున్న తీరుపై రైతులతో కలిసి ఉద్యమించింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా దగా చేసిన కూటమి ప్రభుత్వం.. ఆరుగాలం పండించిన పంటకు సైతం మద్దతు ధర కల్పించలేని దుస్థితిలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందంటూ వైఎస్సార్‌సీపీ గళమెత్తింది. ఏలూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌లో నాయకులు వినతిపత్రం అందజేశారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్‌తో పా టు ముఖ్యులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. వరి కంకులు చేతబట్టి కూటమి సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ నగరంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. నగరంలోని ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచిఇ ఎన్‌ఆర్‌పేట మీదుగా జెడ్పీ సెంటర్, కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నినాదాలు చేసి అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథం, రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, జెడ్పీ వైస్ చైర్మన్ పి.విజయ్‌బాబు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, జగ్గవరపు జానకిరెడ్డి, ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్‌బాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మున్నుల జాన్‌గురునాథ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలాడి దుర్గారావు, వడ్డీలు సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముంగర సంజీవ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి జానారెడ్డి, లీడ్‌క్యాప్ మాజీ డైరెక్టర్ సొంగా సందీప్, దయాల నవీన్‌బాబు, జెడ్పీటీసీ నీరజ, డీబీఆర్‌కే చౌదరి, కామవరపుకోట జెడ్పీటీసీ కడిమి రమేష్, లింగపాలెం ఎంపీపీ ముసునూరు వెంకటేశ్వరరావు, కామవరపుకోట మండల అధ్యక్షుడు మిడతా రమేష్, జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, అచ్చి రాజు, కొఠారు మోహన్, బొడ్డు వెంకటేశ్వరరావు, కేవీఎస్ రామకృష్ణ, రంగబాబు, సాగర్, బత్తిన చిన్న, సంకు సత్యకుమార్, దండు రామకృష్ణ, ఉంగుటూరు మంగరావు, రావిపాటి సత్యకుమార్, నిడమర్రు జెడ్పీటీసీ కోడే కాశీ, ఉంగుటూరు జెడ్పీటీసీ కోరుకొల్లు జయలక్ష్మి, దాసరి విష్ణు, వాసిరెడ్డి మధు, కామిరెడ్డి నాని, తేరా ఆనంద్, రఘు, జానంపేట బాబు, జితేంద్ర, సూర్యనారాయణ మాస్టారు, నిట్టా గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
కూటమిది అరాచక పాలన
కారుమూరి సునీల్‌కుమార్, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త
కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టేందుకు ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి కేవలం వేధింపులు, అరాచక పాలనకే పరిమితమయ్యారు. జగనన్న పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పు డు రైతులకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. కనీసం గిట్టుబాటు ధర కల్పించే స్థితిలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ లేరు. రాష్ట్రంలో రైతుల దీన స్థితిపై కూడా ఆయనకు చిత్తశుద్ధి లేదు. కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదు.
చంద్రబాబు మోసకారి
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్యే, నూజివీడు సమన్వయకర్త
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు కావస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయలేని స్థితిలో ఉండటం సిగ్గుచేటు. తక్కువ ఖర్చుతో కూ డిన మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సైతం సక్రమంగా అమలు చేయడం లేదు. వైఎస్సార్‌సీపీని ఎవ రు విడిచిపెట్టినా ఏమీ ఇబ్బంది లేదు. రాబోయే ఎ న్నికల్లో సమర్థవంతమైన నాయకులను నిలబెట్టి గెలిపించుకునే సత్తా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది. నీకు రూ.15 వేలు నీకు రూ.15 వేలు అని నమ్మించి దారుణంగా మహిళలను, విద్యార్థులను మోసం చేసింది సీఎం చంద్రబాబు కాదా.
కాలకూటమిపై ఉద్యమ బావుటా
కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్ సీపీ గళం
భారీ ర్యాలీ, నిరసనతో హోరెత్తిన ఏలూరు
రైతుల నడ్డివిరిచిన కూటమి సర్కారు అంటూ నినాదాలు
కలెక్టరేట్‌లో డీఆర్వోకు వినతిపత్రం అందజేత
రైతులకు తీరని ద్రోహం
దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలల్లోనే రాష్ట్రంలోని అన్నివర్గాలనూ దారుణంగా మోసం చేసింది. ముఖ్యంగా రైతులకు తీరని ద్రోహం చేసింది. పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తానని నమ్మించి మోసం చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించలేని దుస్థితి నెలకొంది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ సీఎం జగన్ ఇచ్చిన హామీ కంటే అదనంగా రైతు భరోసా సాయం రూ.13,500 అందించారు. అయితే సీఎం చంద్రబాబు ఇప్పుడు ఇస్తానని చెప్పిన పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టారు. రైతులకు మేలు చేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేలు ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. తుపానులు, వరదలు వచ్చి పంట తడిసి రంగుమారినా కొనుగోలు చేసిన ఘనత మాజీ సీఎం జగన్‌కు దక్కుతుంది. నేడు మిల్లర్లు, దళారులతో కూటమి ప్రభుత్వం మిలాఖత్ కావటంతో పంట కొనేవారు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయం దండగ అనే పాత విధానాన్నే మరలా సీఎం చంద్రబాబు అవలంబిస్తూ రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment