ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నగరపాలక, పురపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ ఆసిస్టెంట్ సమాన కేడర్ గల ఉపాధ్యాయులకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు పదోన్నతులు కల్పించేందుకు ఫైనల్ సీనియారిటీ లిస్టు డీఈఓ ఏలూరు వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు ఉపాధ్యాయులు సర్టిఫికేట్ వెరిఫికేషన్, కొన్సిలింగ్ కోసం సంబంధిత సర్టిఫికెట్‌లు, సర్వీసు రిజిస్టర్‌తో పాటుగా ఈ నెల 20న ఉదయం 9 గంటల లోపు ఏలూరులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment