విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలోను జగన్ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆకర్షణీయ మెనూతో రోజుకో కొత్త రుచిని అందిస్తూ జగనన్న గోరుముద్ద పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ రైస్‌తో పాటు రాగిజావ, కోడిగుడ్డు, చిక్కీలతో విద్యార్థులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందించింది.
ఉన్నత విద్యకు భరోసా
ఆర్ధికపరమైన ఇబ్బందులతో పేద విద్యార్థులు మధ్యలో ఉన్నత చదువులు మానేయకుండా జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా వారికి అవసరమైన ఆర్ధిక సాయాన్ని తల్లుల ఖాతాలకు జమచేస్తూ వచ్చారు. సీఎం జగన్ పాలనలో క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మొత్తాన్ని జమచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలుగా విద్యా దీవెన, వసతి దీవెన నిధులు విడుదల చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment