ప్రపంచంతో పేద విద్యార్థులు పోటీపడేందుకు వీలుగా దృశ్య, శ్రవణ విద్య ద్వారా వారిలోని అభ్యసన సామర్థ్యం పెంపొందించేందుకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 2022 డిసెంబరు 21న తన పుట్టినరోజున 8వ తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు అప్పటి సీఎం జగన్ ట్యాబుల పంపిణీ ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో 2022– 23 విద్యా సంవత్సరంలో 18,370 విద్యార్థులు, 2613 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో 17,410 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏలూరు జిల్లాలో 16614 మంది ఉండగా వారు ట్యాబుల కోసం ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment