జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో పట్టణంలోని ఎన్ఏసీ ట్రైనింగ్ సెంటర్ (స్కిల్ హబ్) నందు ఈ నెల 3వ తేదీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్ నందు అపోలో ఫార్మసీ, ఎన్ఎస్ ఇనుస్ట్రుమెంట్స్, కొల్గెట్ పామోలివ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 150 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్‌మేళాకు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉండి 18–30 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 96425 98324, 96525 03799ను (9988853335 – టోల్ ఫ్రీ) సంప్రదించవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment