హరికథే ఆమె ప్రత్యేకత
● చిరుప్రాయం నుంచి హరికథా గానంతో అబ్బురపరుస్తున్న మహిళ
● అమెరికాలో ఉంటూ కూడా కళాసేవ
తెలిసీ తెలియని చిరుప్రాయంలో మూడేళ్ల వయసున్న సమయంలోనే తాత యాళ్లబండి తాతారావు భగవతార్ వద్ద హరికథలో శిక్షణ పొంది నాలుగేళ్ల ప్రాయంలోనే తొలి ప్రదర్శన ఇచ్చి అహుతుల చేత భళా అనిపించుకున్న హరికథా గాయకురాలు తాడేపల్లిగూడేనికి చెందిన యాళ్లబండి భువనేశ్వరి. ఆమె ప్రజ్ఞ, పాటవాలతో ఎంతో మంది కళాకారులకు ఆదర్శనీయంగా ఉంటుంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా హరికథను మర్చిపోకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆ కళకు ప్రాచుర్యం తీసుకు వస్తూ అందరి మన్ననలు పొందుతుంది.
– తాడేపల్లిగూడెం (టీఓసీ)
పట్టణానికి చెందిన ప్రముఖ హరికథా కళాకారుడు యాళ్లబండి తాతారావు భాగవతార్ గురించి హరికథ ప్రియులకు పరిచయం అవసరం లేను పేరు హరికథకే ఆయన జీవితం అంకితమిచ్చి ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చి సత్కారాలు, బిరుదులు పొంది, ఎందరికో హరికథలో శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఆయన కుమారులు, కుమార్తెలకు కూడా హరికథ, సంగీత కళల్లోనే శిక్షణ అందించారు. ఆయన బాటలో మనుమరాలు యాళ్లబండి భువనేశ్వరికి కూడా రెండో ఏటా నుంచి తాతయ్య నుంచి శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. నాలుగేళ్లకే జాతీయ స్థాయి బాలల పాటలు పోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. ఐదేళ్ల వయస్సులోనే తాడేపల్లిగూడెం అక్బర్ నెలకొల్పిన ప్రముఖ కళా సంస్థ చిరుగులాభి వేదికపై భువనేశ్వరీ తొలి ప్రదర్శన ఇచ్చి భళా అనిపించుకుంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో
అనంతరం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక వేదికలపై ఆమె హరికథ ప్రదర్శనలు ఇచ్చింది. నర్సీపట్నంలోని పసిడి మొగ్గ అనే సంస్థ, కొత్త వలసలో కళాభారతి సంస్థల వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ హరికథకులు బుర్ర శివరామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో విశాఖ, చీరాల, రామగుండం, విజయవాడలో ప్రదర్శనలు ఇచ్చి ఘన సన్మానాలు పొందారు. విశాఖ కల్చర్‌ల్ అకాడమీ వారి ఉగాది పురస్కారం అందుకుంది. ముఖ్యంగా మాజీ ప్రధాని వాజ్‌పాయ్, కేంద్ర మాజీ మంత్రి ఎల్‌కే అద్వానీల సమక్షంలో జాతీయ గీతాలను ఆలపించి వారి ప్రశంసలు పొందింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు చెరుకువాడ రంగనాథరాజు, పైడికొండల మాణిక్యాలరావు సమక్షంలో హరికథలు చెప్పి మెప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలుగు సినీ నటుడు సుమన్‌ల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
అమెరికాలో అసామాన్య ప్రతిభ
భువనేశ్వరి అమెరికా ఓక్లహోమా విశ్వ విద్యాలయంలో ఎంఎస్ చేసింది. అక్కడ విద్యార్థిగా ఎన్నో వేదికలపై తమ కళాశాల తరఫున ప్రదర్శనలు ఇచ్చి వారి ప్రశంసలు పొందింది. బెంగళూరు, హైదరాబాద్‌లో ఒరాకిల్‌లో ఉద్యోగరీత్యా ఆ సంస్థ వేదికలపై కళా ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికాలో ఉద్యోగరీత్యా ఉంటూ అక్కడి తెలుగు సంస్థల సభల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు.
అమెరికాలో హరికథ పాఠశాల ఏర్పాటే లక్ష్యం
తెలుగువారి హరికథ గొప్పతనాన్ని తెలియజేయాలని సంకల్పంతో అమెరికాలో హరికథ పాఠశాల ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. నెల రోజులుగా సెలువులు ఉండడంతో తల్లిదండ్రుల ఇంటికి వచ్చాను. ఇటీవల బీవీఆర్ కళా కేంద్రంలో సీతారామ కల్యాణం హరికథ చెప్పడంతో కళా పురస్కారం అందించి సత్కరించారు. అమెరికాలో నా భర్తతో కలిసి ఉద్యోగం చేస్తూనే హరికథ, శాసీ్త్రయ సంగీతం ప్రచారం చేస్తాను.
– యాళ్లబండి భువనేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment