ప్రజాధనంతో పార్టీ రంగులా?
తణుకు అర్బన్: ఐదేళ్లుగా జాతీయ జెండా రంగుల ఎల్‌ఈడీ లైట్లతో ఉన్న విద్యుత్ స్తంభాలు కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో పసుపు రంగు ఎల్‌ఈడీ లైట్లుగా మారాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏర్పాటుచేసిన పసుపురంగు వెలుగులపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా గత ఐదేళ్లు కూడా జాతీయ జెండాలోని రంగులను ఈ విద్యుత్ స్తంభాలకు వెలుగులు ఏర్పాటు చేసే సంస్కృతి తణుకులో గత పాలనలో ఉండగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పసుపు రంగు వెలుగులు ఏర్పాటుచేయడాన్ని ప్రజలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మునిసిపాలిటీకి ప్రజలు చెల్లించే వివిధ పన్నుల తాలూకా నిధులను ప్రజల అవసరాలు, సౌకర్యాల కోసం వెచ్చించాల్సి ఉండగా, పాలకుల ఆదేశాల మేరకు పార్టీ రంగైన పసుపు రంగులు ఏర్పాటు చేయడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్డు, ఆర్వోబీ, వేల్పూరు రోడ్డు, పెరవలి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్లల్లో విద్యుత్ దీపాలతో ఉన్న 150కు పైగా స్తంభాలకు పసుపు రంగున్న ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment