పన్నుపోటు వెన్నుపోటు కంటే ఎక్కువగా బాధిస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లి పన్ను తీయించుకునే వరకు మరో ఆలోచన రానివ్వనంతగా వేధిస్తుంది. అయితే పన్ను తీయించుకోవడంతో సమస్య తీరిపోదు, అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆ ఖాళీని అలాగే వదిలేయకూడదు. తిరిగి కొత్త పన్ను కట్టించుకోవాల్సిందే. పన్ను కట్టించుకోకుండా ఎక్కువ కాలం గడిచిపోయే కొద్దీ పక్కన ఉన్న దంతాలు ఒరిగిపోతాయి, పట్టు తప్పిపోతాయి కూడా.
ఒకవేళ తీయించుకున్నది కింద దవడ పన్ను అయితే ఆ స్థానంలో పై దవడకు ఉన్న పన్ను కిందకు జారిపోతుంది. ఆ పన్నుకు ఉండాల్సిన సపోర్టు కోల్పోవడంతో అలా జరుగుతుందన్నమాట. అలాగే మరో విషయం... ఏమిటంటే ఇప్పుడు డాక్టర్లు పిప్పిపన్నును గుర్తించిన వెంటనే తొలగించడం లేదు. దానిని పరిరక్షించే వైద్యవిధానాల మీదనే దృష్టిపెడుతోంది వైద్యరంగం. వీలు కాని దశ వరకు నిర్లక్ష్యం చేసినప్పుడు పన్నును కోల్పోక తప్పదు, ఆ ఖాళీలో కృత్రిమ పన్ను కట్టించుకోక తప్పదు. ‘పన్నుపోటు’ తప్పదన్న మాట.
చదవండి: Kidney Stones Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే...
Comments
Please login to add a commentAdd a comment