● ఆ సంకల్పమే జగన్‌పై నమ్మకాన్ని పెంచింది
అదే బోయపాలేనికి చెందిన నరేంద్ర వర్మతో మాట్లాడగా.. ‘నాకు భార్య, నలురుగు సంతానం. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కూలీనాలి చేసుకుని జీవించే మేము.. మా పిల్లలను ఎలా చదివించగలం. నేనూ నా భార్య ఇద్దరం ఇదే విషమై.. ఆలోచించి బాధపడేవాళ్లం. కానీ సీఎం జగన్ ‘నాడు–నేడు’తో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌లా మార్చడంతో మా బాధ తీరింది. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టాడు.. అది మావంటి పేదలకు బోనస్‌లా అనిపించింది. పిల్లల్ని సర్కార్ స్కూలోనే ధైర్యంగా చేర్పించాను. జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం బోధన, జగనన్న విద్యా కానుక, విద్యాదీవెన, వసతి దీవెన వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు బాగా చదివి మేధావులుగా ఎదిగి, భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలనే జగనన్న సంకల్పమే.. ప్రజలకు ఆయనపై పూర్తినమ్మకాన్ని పెంచింది.’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment