పిన్నమనేని మృత్యుంజయరావు
అనగనగా, రాతిలో తేమ, ఆస్తికులు, గురితప్పిన వేటు, అసత్యం వంటి నాటికలు, కథలు, నవలలు రచించారు. వర్తమాన నాటక రంగంలో రచయితగా గుర్తింపు పొందిన ఈయన రెండో సదస్సుకు అధ్యక్షత వహిస్తారు.
అంబటి మురళీకృష్ణ
తెలుగు సాహిత్యం, నాటక విశ్లేషకులుగా గుర్తింపు పొంది, బాపట్ల వివేక సంస్థ ద్వారా వందలాది సాహిత్య సభలను నిర్వహించారు. అనేక గ్రంథాలను ముద్రిస్తూ, నేడు పలు నాటక పరిషత్తులకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈయన తొలి సదస్సుకు అధ్యక్షత వహిస్తారు.
పి.ఎ. దేవి
రంగస్థలం ఆధునిక వీధి నాటికలను 20కి పైగా రచించి, దర్శకత్వం వహించారు. సామాజిక విశ్లేషకురాలిగా గుర్తింపు పొందారు. జాతీయ, అంతర్జాతీయ నాటకోత్సవాలు, సదస్సుల్లో ప్రసంగించారు. సీ్త్ర వికాసంపై ఆమె అవగాహన కల్పిస్తారు.
డాక్టర్ విభానుపుడి సుబ్బరాజు
శతాధిక పద్య నాటకాలను ప్రదర్శించిన రంగస్థల నటుడు. సురభి నాటక రంగంపై పరిశోధన చేసే గౌరవ డాక్టరేట్ పొందారు. వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకులైన ఆయన పద్య నాటకంపై అనేక జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. ఈ సదస్సులో సీ్త్ర అభ్యుదయంపై ఉపన్యసిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment