నాటక వేదికగా అతివకు అందలం
యడ్లపాడు: ‘తెలుగు నాటకం– సీ్త్రవాదం’పై ఈ నెల 26వ తేదీన మేధోమథనం జరగనుంది. ఈ సదస్సుకు సాహితీ ప్రముఖులు, నాటకరంగ ఉద్ధండులు హాజరుకానున్నారు. ఇందుకు యడ్లపాడు మండలం వేదిక కానుంది. కేంద్రసాహిత్య అకాడమీ, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల వేదిక (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ కార్యక్రమం నిర్వహణకు రంగం సిద్ధమైంది. వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు అధ్యక్షత జరిగే కార్యక్రమానికి తెలుగు నాటకరంగంలో అపార అనుభవం గడించిన మేధావులు, మహిళా జాగృతికై తమ అక్షరగళంతో పోరాడుతున్న సాహిత్య పురస్కార గ్రహీతలు, విద్యా, సాంస్కృతిక రంగాల్లోని ప్రముఖులు, నాటక దర్శక, రచయితలు, కళాకారులు, సీ్త్రవాద రచనలు చేసే కవులు, రచయితలు, వక్తలు సుమారు 250 మందికిపైగా భాగస్వాములు కానున్నారు. ‘తెలుగునాటక రంగం–సీ్త్రవాదం’పై తమ కలాలతో, గళాలతో జనజాగృతి చేయనున్నారు.
రేపు ‘తెలుగు నాటకం– సీ్త్రవాదం’పై సదస్సు యడ్లపాడుకు రానున్న సాహిత్య, నాటకరంగ ప్రముఖులు 250 మందికిపైగా విద్య, సాహిత్య, సాంస్కృతిక రంగ ప్రతినిధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు సదస్సుల్లో చర్చాగోష్టి
హాజరయ్యే ప్రముఖులు వీరే...
Comments
Please login to add a commentAdd a comment