డాక్టర్ ఓల్గా
ఆధునిక తెలుగు సాహిత్యంలో సీ్త్రవాదానికి బలమైన పునాదులు వేసిన రచయిత్రులలో ఓల్గా ఒకరు. ‘స్వేచ్ఛ’, ‘తోడు’ వంటి నవలలతోపాటు సీ్త్రవాదాన్ని ప్రతిబింబించే వందలాది కథలను రచించారు. కేంద్రసాహిత్య పురస్కారంతోపాటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న ఈమె కీలకోపన్యాసం చేయనున్నారు.
వల్లూరు శివప్రసాద్...
‘హంసధ్వని, వానప్రస్థం, మట్టి మనిషి, ఏకాకినౌక వంటి 30కిపైగా నాటకాలు, నాటికలు రచించారు. పరిషత్తులలో 200పైగా ఉత్తమ నాటక రచయిత పురస్కార గ్రహీతగా నిలిచారు. వందకుపైగా తన రచనల్ని 7 సంకలనాలుగా ముద్రించి, నాటక సాహిత్యానికి మహోపకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా, సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులుగా వ్యవహరిస్తున్న ఈయన స్వాగతోపన్యాసం చేయనున్నారు.
డాక్టర్ సీహెచ్ సుశీలమ్మ
తెలుగు అధ్యాపకురాలు, ప్రిన్సిపల్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన డాక్టర్ సుశీలమ్మ.. ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై పరిశోధన చేసి గౌరవ డాక్టరేట్ పొందారు. సీ్త్రవాద నేపథ్యంగా యూజీసీ ప్రాజెక్టుల ద్వారా పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో తెలుగు సాహిత్యంపై పత్ర సమర్పణ చేసిన ఆమె.. ఈ సదస్సులో సీ్త్ర చిత్రణపై పత్ర సమర్పణ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment