ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటుహక్కు
గుంటూరు వెస్ట్: ప్రపంచంలోనే అతి పెద్దదైన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటుహక్కు ఊపిరి వంటిందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు, ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, సీనియర్ సిటిజన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటుహక్కు వినియోగంపై అవగాహన పెంచేందుకు భారత ఎన్నికల సంఘం 2011 నుంచి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోందని వివరించారు. 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని, ఇప్పటికీ 75 వసంతాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, దివ్యాంగులకు లింగ వివక్ష లేకుండా ఓటుహక్కు కల్పించినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి మాట్లాడుతూ పౌరులందరూ ఓటు సద్వినియోగం చేసుకుంటే ఆదర్శవంతమైన ప్రభుత్వాలు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్‌ను సత్కరించారు. వక్తృత్వ పోటీలు, వ్యాసరచన, డ్రాయింగ్, స్లోగన్, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కంచర్ల శివరామయ్య, డీఆర్వో షేక్ ఖాజావలి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment