రాజధాని ప్రాంతంలో అక్రమంగా మట్టి తవ్వకాలు
ఐదుగురుని అరెస్టు చేసిన పోలీసులు
తాడేపల్లి రూరల్: రాజధాని పరిధిలోని మంగళగిరి రూరల్ కృష్ణాయపాలెంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఐదుగురు వ్యక్తులను మంగళగిరి రూరల్ పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఎస్‌ఐ వెంకట్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 8న మంగళగిరి రూరల్ రాజధాని గ్రామమైన కిష్టాయపాలెంలో ఈ–8 రహదారిలో గతంలో ప్రభుత్వం గ్రావెల్ రోడ్డు నిర్మించింది. దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు జనవరి 8న తవ్వేశారంటూ సంబంధిత అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. మట్టి తవ్వకాలు నిర్వహించిన సూత్రధారుడు, పాత నేరస్తుడు యర్రబాలేనికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. తవ్వకాలు చేసిన వారు తాడేపల్లికి చెందిన ఏసు, మస్తాన్ అని తెలిపాడు. వారిని కూడా విచారించి మట్టి తవ్వకాలు జరిగినట్లు నిర్ధారించినట్లు ఎస్‌ఐ వెంకట్ తెలిపారు. జేసీబీ, లారీ డ్రైవర్‌ను కూడా అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment