మేరా భారత్ మహాన్
గుంటూరు పోలీస్ కవాతు మైదానం గణతంత్ర వేడుకలకు సిద్ధమైంది. అధికారులకు విశాలమైన వేదికను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను నగర ప్రజలు వీక్షించేందుకు గానూ ఏర్పాట్లు చేశారు. పోలీస్ కవాతు రిహార్సల్‌ను జిల్లా ఎస్పీ శనివారం పరిశీలించారు. జాతీయ జెండాను ఎగురవేసే క్రమంలో అను సరించాల్సిన విధులపై చర్చించారు. కలెక్టర్ నాగలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాకే తలమానికమైన ఎయిమ్స్ ఆసుపత్రిని మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించనున్న జెండా వందనలో వైద్య విద్యార్థులతో పాటు వివిధ శాఖలకు చెందిన డాక్టర్లు, సిబ్బంది పాల్గొననున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
– గుంటూరు వెస్ట్ / తాడేపల్లి రూరల్
Comments
Please login to add a commentAdd a comment