● మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం
ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కళాశాల ఆవరణలోని జింఖానా ఆడిటోరియంలో శనివారం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు రాష్ట్రస్థాయి అవగాహన సదస్సును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వం మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు న్యాయవాదులు ఎక్కువ దృష్టిసారించాలని ఆయన సూచించారు. మధ్యవర్తిత్వంలో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని వివరించారు. – నగరంపాలెం(గుంటూరు వెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment